📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

దువ్వాడ పై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు

Author Icon By sumalatha chinthakayala
Updated: March 4, 2025 • 6:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌పై దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు దువ్వాడ శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు జనసేన నేతలు విజ్ఞప్తి

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్లలో జనసేన నాయకులు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేశారు. పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించకుండా ఉండేందుకు రూ.50 కోట్లు తీసుకున్నాడని ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు జనసేన నేతలు విజ్ఞప్తి చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌పై అవనిగడ్డ, మచిలీపట్నం, తిరువూరు, పెడన, పామర్రు, గుడివాడ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి.

అమలాపురం డీఎస్పీని కలిసి ఫిర్యాదు

దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన జనసేన మహిళా కౌన్సిలర్లు, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. దువ్వాడపై గుడివాడ, మచిలీపట్నం, పామర్రు, పెడన, తిరువూరు, అవనిగడ్డ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. మరోవైపు దువ్వాడకు వ్యతిరేకంగా జనసేన శ్రేణులు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.

Breaking News in Telugu complaints duvvada srinivas Google news Google News in Telugu Latest News in Telugu several police stations Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.