Ambati Rambabu : అంబటి వ్యాఖ్యల పై తిరుపతి లో పిర్యాదులు

Read Time:  1 min
Ambati Rambabu : అంబటి వ్యాఖ్యల పై తిరుపతి లో పిర్యాదులు
FONT SIZE
GET APP

Ambati Rambabu: తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేత అంబటి రాంబాబు పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. కొడూరు బాలసుబ్రహ్మణ్యం అధికారికంగా పోలీసు ఫిర్యాదు అందజేశారు.ఈ సందర్భంగా తిరుపతి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్ వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డా. కొడూరు బాలసుబ్రహ్మణ్యం పాదయాత్ర నిర్వహించి, అనంతరం ఫిర్యాదును సమర్పించారు.

Read Also: AP: నల్లపాడు PS నుంచి అంబటి తరలింపు

డా. కొడూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన, అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు, రాజకీయ సంస్కృతికి పూర్తిగా విరుద్ధమని తీవ్రంగా మండిపడ్డారు. వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయంగా మాట్లాడే అర్హత లేనితనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు.

Ambati Rambabu
Ambati Rambabu

ఇలాంటి దిగజారిన వ్యాఖ్యలతో వైసీపీ పార్టీ ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిందని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పదని డా. కొడూరు బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ తమకు మిగిలిన 11 సీట్లను కూడా తప్పనిసరిగా కోల్పోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు బుల్లెట్ రమణ , నియోజకవర్గ ఇన్‌చార్జ్ మన్నూరు సుగుణమ్మ , బీజీ కృష్ణ యాదవ్ , వెంకట పుష్పావతి , టుడా చైర్మన్ దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొని వైసీపీ నేతల వ్యాఖ్యలను ఏకగ్రీవంగా ఖండించారు.

ప్రజల గౌరవాన్ని, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే వ్యాఖ్యలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.