📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: Siva Jyothi: తిరుమల ప్రసాదంపై వ్యాఖ్యలు.. ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన శివజ్యోతి

Author Icon By Aanusha
Updated: November 23, 2025 • 10:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి మంచి క్రేజ్ తెచ్చుకుంది శివ జ్యోతి. బిగ్ బాస్ హౌస్‌లోనూ సందడి చేసింది శివ జ్యోతి (Siva Jyothi). ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఆమె పలు టీవీ షోల్లో పాల్గొంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ రకరకాల వీడియోలు చేస్తూ సందడి చేస్తుంది. అలాగే కొన్ని వివాదాల్లోనూ చిక్కుకుంది ఆమె.. తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది శివజ్యోతి.

Read Also:  Bigg Boss 9: ఈ వారం హౌస్ నుండి వెళ్లిపోయేది ఆమేనా?

తిరుమల ప్రసాదం పై శివ జ్యోతి (Siva Jyothi) చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. శివజ్యోతి పై నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా క్యూ లైన్‌లో నిలబడి ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.ఇటీవల తిరుపతి దర్శనం, ప్రసాదం గురించి శివజ్యోతి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి.

ఈ నేపథ్యంలో స్పందించిన ఆమె, తన తప్పును అంగీకరిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. “పొద్దున్నుంచీ తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన మాటలు చాలా మందిని బాధించాయి. వివరణ ఇచ్చే ముందు హర్ట్ అయిన ప్రతి ఒక్కరికీ సారీ చెబుతున్నాను,” అని ఆమె పేర్కొన్నారు.

View this post on Instagram

A post shared by Shiva Jyothi (@iam.savithri)

క్షమాపణ కోరుతున్నా

తాము రూ.10,000 ఖరీదైన ఎల్1 క్యూ లైన్‌లో వెళ్లామని, ఆ ఉద్దేశంతోనే ఖరీదైన లైన్ అని అన్నానని, అంతేకానీ ‘మేము ధనవంతులం’ అనే అహంకారంతో కాదని ఆమె స్పష్టతనిచ్చారు. తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి అని, నాలుగు నెలలుగా శనివారం వ్రతాలు కూడా చేస్తున్నానని తెలిపారు.

“నాకు అత్యంత విలువైన నా బిడ్డను ఆ వెంకటేశ్వర స్వామే ఇచ్చాడు. అలాంటిది ఆయన గురించి నేనెలా తప్పుగా మాట్లాడతాను?” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.యూట్యూబ్ ఛానెళ్లు, కేసుల భయంతో కాకుండా, అలా మాట్లాడి ఉండకూడదని నాకే అనిపించింది. అందుకే క్షమాపణ కోరుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు పునరావృతం కాదు,” అని శివజ్యోతి స్పష్టం చేశారు. ఆమె క్షమాపణతో ఈ వివాదం సద్దుమణిగినట్లేనని భావిస్తున్నారు.
 

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News latest news ShivaJyothi Telugu News TirumalaPrasadam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.