📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Telugu News: Cold Wave: తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు

Author Icon By Pooja
Updated: December 14, 2025 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత( Cold Wave) రోజురోజుకీ పెరుగుతోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర, మధ్య, తూర్పు, పశ్చిమ తెలంగాణలో ఈరోజు మరియు రేపు చలిగాలులు వీచే సూచనలు ఉన్నాయని తెలిపారు.

Read Also: Clean airplan: వాయు కాలుష్య నియంత్రణకు హరియాణా కీలక అడుగు

Cold Wave

తెలంగాణలో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు

శనివారం (డిసెంబర్ 13) రాత్రి తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఆదిలాబాద్‌లో 6.7 డిగ్రీలు, పటాన్‌చెరువులో 6.8 డిగ్రీలు,( Cold Wave) మెదక్‌లో 7.5 డిగ్రీలు నమోదయ్యాయి. రాజేంద్ర నగర్‌లో 8.5 డిగ్రీలు, హనుమకొండలో 10 డిగ్రీలు, హైదరాబాద్‌లో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే రామగుండం (11.5), దుండిగల్ (11.6), హయత్‌నగర్, నిజామాబాద్ (12), ఖమ్మం (13), నల్లగొండ (13.6), భద్రాచలం (14), మహబూబ్‌నగర్ (14.1), హకీమ్‌పేట (15.5) డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

ఏపీలోనూ చలి దెబ్బ.. ఏజెన్సీ ప్రాంతాల్లో గడ్డకట్టే చలి

ఆంధ్రప్రదేశ్‌లోనూ చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. దట్టమైన పొగమంచు కారణంగా మినుములూరు, అరకులో 5 డిగ్రీలు, అరకు, పాడేరు ప్రాంతాల్లో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చలిమంటలు, పొగమంచు.. వాహనదారులకు ఇబ్బందులు

చలి తీవ్రతను తట్టుకునేందుకు గిరిజనులు చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. పొగమంచు అధికంగా ఉండటంతో రహదారులపై వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. మరో మూడు రోజుల పాటు చలిగాలుల తీవ్రత కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. చిన్నారులు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Weather Google News in Telugu Latest News in Telugu Telangana Weather

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.