📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu news : Cold season : చలి కాలపు జంఝాటం

Author Icon By Sudha
Updated: December 4, 2025 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణాది రాష్ట్రాలను ‘చలి పులి’ పిండేస్తోంది. జనం ఝాము పొద్దెక్కినా నిద్రలేవలేకపోతు న్నారు. చలికి భయపడి మంచాలు దిగిరావడం లేదు. శీతాకాలంలో చలి ఎక్కువగానే ఉంటుందని ముందుగానే భారత వాతావరణ విభాగం హెచ్చరించిం ది. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశాలోని అధిక ప్రాంతాలకే ఈ పరిస్థితి ఉంది. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు పక్కనే ఉన్న పార్వతీపురం, మన్యం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చలి తీవ్ర ప్రభావాన్ని చూపెడుతోంది. ఆంధ్ర ప్రదేశ్లో గత యేడాది ఇదే సమయంలో చలి ప్రభావాన్ని గమనిస్తే ఈసారి తక్కువేనని చెప్పాలి. చలి ఎక్కు వగా ఉన్నా, తక్కువగా ఉన్నా ఆయా రాష్ట్రాలలో అధిక చలి (Cold season)వలన సీజనల్ జ్వరాలకు జనంలో ఆందోళన పెరిగి పోయింది. ఆస్పత్రుల్లో రద్దీ పెరిగింది. ప్రైవేట్ ఆస్పత్రు లు కిటకిటలాడుతున్నాయి. చలితోపాటు సాంక్రమిక వ్యాధులు ప్రజల్ని\ ఊపిరిపీల్చుకోనివ్వడం లేదు. ఇంత చలిలోనూ కళ్లు మంటలు తప్పడం లేదు. ఈ నేపథ్యం లోనే ప్రతి వ్యక్తి నీరు ఎక్కువగా తాగాలని జాగ్రత్తలు చెప్తున్నారు డాక్టర్లు. చలికాలపు (Cold season)శీతల వాతావరణాన్ని గతంలో మాదిరిగా తట్టుకోలేకపోతున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోవడమే అందుకు కారణం. ప్రత్యేకించి చల్లటి వాతావరణం, పొగమంచుతోపాటు తేమ కూడా కాస్త ఇబ్బందిపెడుతోంది. అధిక చల్లదనాన్ని భరించలేని శరీరానికి రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఈ సీజన్లో వ్యాప్తి చెందే సాధారణ వ్యాధులతోపాటు కొన్ని వైరస్లకు సంబంధించిన కొత్త వేరియంట్స్ తో కలిపిన జ్వరాలు రోగుల మీద దాడిచేస్తున్నాయి. ఈ మధ్య కాలం లో జలుబు, గొంతునొప్పి విపరీతంగా జనాన్ని బాధిస్తున్నాయి. స్త్రీ, బాల, వృద్ధులు వీటికి గురై ఆస్ప త్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సీజన్లో శ్వాసకోస సంబంధిత వ్యాధులు బాగా ఉధృతంగా ఉన్నాయి. ఈ కాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండడంతోనే జలుబు, గొంతునొప్పులు వగైరా లక్షణాలు కనిపిస్తున్నాయి. ఓ పట్టాన శీతాకాలపు వ్యాధులు అంత గమ్మున తగ్గవు. సతాయిస్తూనే ఉంటాయి. వాటి లక్షణాలు విచిత్రంగా ఉంటాయి. పుండ్లు కూడా మానవు. ఒక్కొక్కప్పుడు శీతగాలులకు కళ్లు మసకబారుతాయి. ఫ్లూ, న్యూమోని యా, బ్రాంఖైటిస్ వంటి సీజనల్గా వచ్చే వ్యాధులు శ్వాసకోస అలెర్జీలను వెంటతెస్తాయి. తలనొప్పి, తుమ్ము లు, కండరాల నొప్పిలతో జ్వరాలు సోకుతున్నాయి. వీటితోపాటు న్యూమోనియా సోకితే కోలుకోవడానికి కొదినద రోజులు పడుతుంది. శ్వాసకోశ వ్యాధులన్నీ ఇబ్బంది పెట్టేవే. శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్ పెరిగితే కండరాల నొప్పులు, ఉబ్బసం లక్షణాలతో నీరపడతాయి. కొందరి లో ఆస్మాతీవ్రత పెరిగి ముక్కుదిబ్బడేస్తుంది. గొంతులో శ్లేష్మం ఊరుతుంది. తరచు ఇబ్బంది పెడుతుంది. ఉష్ణో గ్రతలు బాగా తగ్గడం వలన రక్తనాళాల్లో ఒత్తిడి పెరిగి
ఒక్కోసారి హార్ఎటాక్ కి గురవుతారు. వయసుతో నిమిత్తం లేకుండా చలి నుంచి రక్షణ పొందేందుకు అప్రమత్తమవ్వా లి. చర్మంలో తేమ తగ్గిన సందర్భాలలో చర్మం పొడిగా మారి ఎగ్జిమా, డయాబిటిస్ వ్యాధులకు దారితీస్తాయి. చర్మానికి పోషకాలు అందని పరిస్థితులు ఏర్పడతాయి. చర్మవ్యాధులు సోకితే వంటిపై దద్దుర్లు ఏర్పడడం, మంటలెక్కిపోతుం టాయి. ఆంధ్రప్రదేశ్లో నిర్దేశితకాలాల తో నిమిత్తం లేకుండా కురుస్తున్న వర్షాలు మరో విధంగా రోగాలను ఆహ్వానిస్తున్నాయి. గాలిలో తమ కారణంగా ఒళ్లు మంటలు బాధిస్తాయి. తగినంత నీటిని తీసుకోక పోతే డయేరియా, కలరా వంటి వ్యాధులు సోకుతాయి.శరీరానికి సరిపడనంత నీరు డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితుల్నుంచిమనల్ని మనమే కాపాడుకోవాలి. సరైన పోషకాహారం తీసుకోవా లి. ఇదే సమయంలో కాలుష్య వ్యాప్తిని కూడా గుర్తించా లి. పొగమంచుతో బయటకు విడుదలయ్యే కాలుష్యగాలి, మంచు కలిపి కలరా వంటి
వ్యాధులు వ్యాప్తికి కారణమౌ తాయి. ఇదే సందర్భంలో శీతాకాలంలో వచ్చే దోమల బెడదను ఎదుర్కోవాల్సిన ఉంటుంది. మలబద్దకం, పేగు సంబంధిత సమస్యలు, రక్తసావ్రం సమస్యలుంటాయి. వర్షాల వల్ల గుంటల్లోకి నీరు చేరి కాలుష్య కారకాలవు తున్నాయి. ఇక్కడ నిల్వ ఉండే పరిస్థితుల్లో దోమలు విజృంభిస్తాయి. దోమల బాధను తట్టుకోలేక జనం దోమ తెరలను, కాయిల్స్ ను ఆశ్రయిస్తున్నారు. మలేరియా, పైలేరియా వ్యాధులు సోకకుండా డాక్టర్ల సలహాలు తీసుకోవాలి. కొత్త తరహా వైరస్ వ్యాధి ‘స్క్రబ్ టైఫస్’ ఇప్పు డు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించి ముగ్గురిని కాటేసింది. విజ యనగరం, చిత్తూరు పల్నాడు జిల్లాల్లో ఈ వ్యాధి వ్యాప్తి ఉంది. ‘చిగ్గర్మైట్’ కీటకాలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధి. దీనిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాధి గురించి రాష్ట్ర ప్రజలు కొత్తగా వింటున్నారు. అంటు వ్యాధి కాదని డాక్టర్లు చెప్తున్నా ఈ వ్యాధి లక్షణాలు, జాగ్ర త్తలు గురించి జనానికి విస్తృత పరిచయం చేయాల్సిన అవసరముంది. అధిక జ్వరం, చలి, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులతోపాటు వంటిపై గోకుడుపుండ్లు వంటి వి ఏర్పడతాయి. శీతాకాలపు పుండు బ్రహ్మరాక్షసిగా మారకుండా, చలిప్రాంతాలలో అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడం అత్యంత అవశ్యకం. ఈ వ్యాధి అంటువ్యాధి కాదని శాస్త్రజ్ఞులే వివరించాల్సి ఉంది. మరింత వ్యాపించకముందే వైద్యసిబ్బందికి అవగాహన కల్పించడం ప్రభుత్వ బాధ్యత.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News cold season Cold Weather latest news seasonal problems Telugu News winter issues winter troubles

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.