📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Guarantees : కూటమి సర్కార్ మరో కీలక హామీలు అమలుకు సిద్ధం

Author Icon By Sudheer
Updated: March 6, 2026 • 11:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా మరో కీలక అడుగు వేసింది. పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకగా ప్రవేశపెట్టిన ‘అన్న క్యాంటీన్ల’ను ఇకపై గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఈ సేవలను, ఉగాది పర్వదినం సందర్భంగా మండల కేంద్రాల్లోనూ ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. తొలి దశలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 75 కొత్త క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.

Read Also : Botsa Satyanarayana: మళ్లీ అస్వస్థతకు గురైన బొత్స సత్యనారాయణ

సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం, అన్న క్యాంటీన్ల విస్తరణ ద్వారా సామాన్య ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తోంది. అసెంబ్లీ వేదికగా మంత్రి నారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ. 65 లక్షలు ఖర్చు చేస్తోంది. నాణ్యమైన టిఫిన్, భోజనాన్ని కేవలం రూ. 5లకే అందించడం ద్వారా ఇప్పటికే పట్టణాల్లోని పేదలకు, కార్మికులకు గొప్ప ఊరట లభిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా 205 క్యాంటీన్లను పునరుద్ధరించగా, సుమారు 3.07 కోట్ల మంది వీటి ద్వారా ప్రయోజనం పొందినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

Read Also : Gold Rate Today: మరోసారి తగ్గిన పసిడి ధరలు

నిజానికి ఈ పథకాన్ని సంక్రాంతి నాటికే గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం యోచించినప్పటికీ, నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో ఉగాదికి వాయిదా పడింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఒక అన్న క్యాంటీన్ ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దశల వారీగా మండల కేంద్రాలన్నింటినీ ఈ పథకం కిందకు తీసుకువచ్చేలా కసరత్తు చేస్తోంది. ఉగాది వేళ ఈ కొత్త క్యాంటీన్లు ప్రారంభమైతే, పట్టణాలకు వెళ్లే పని లేకుండానే పల్లెల్లోని పేదలకు కూడా నాణ్యమైన ఆహారం అతి తక్కువ ధరకే లభిస్తుందని మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Anna canteen Guarantees kutami govt TDP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.