CMD Sivashankar: ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు

Read Time:  1 min
CMD Sivashankar
CMD Sivashankar
FONT SIZE
GET APP

తిరుపతి : తిరుపతి ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ సంస్థ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, శ్రీసత్య సాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల విద్యుత్ సర్వీసులకు ఇప్పటికే ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లకు ప్రిపెయిడ్ సదుపాయం కల్పిస్తు న్నట్లు ఆ సంస్థ సిఎండి శివశంకర్(CMD Sivashankar) లోతేటి తెలిపారు. సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లతో సిఎండి శివశంకర్ లోతేటి సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదా రులకు ఆధునిక సాంకేతికతతో మరింత మెరుగైన సేవలతో నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు స్మార్ట్ మీటర్లను ఆమర్చడం జరుగుతోందన్నారు.

CMD Sivashankar

Read Also: Pawan Kalyan: పంచాయతీరాజ్ పథకాలకు రూ.10వేల కోట్ల పనులు

సంస్థ పరిధిలో కార్పొరేషన్/ మున్సిపాలిటీలు, వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైట్స్, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో 16,802, 19,460, 13,871, 13,311, 16,829, అనంతపురం 8,136, శ్రీసత్యసాయి 6.717. కర్నూలు 10.457. నంద్యాల జిల్లాలో 9,836 సర్వీసులకు స్మార్ట్ మీటర్లను అమర్చినట్లు(CMD Sivashankar) తెలిపారు. ఈ సర్వీ సులన్నింటినీ ప్రస్తుతం ప్రీపెయిడ్ మీటర్లు గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ప్రిపెయిడ్ మీటర్లకు రీఛార్జ్ చేసేందుకు వీలుగా ఈవాలెట్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ మీటర్ల ద్వారా వినియోగదారులు విద్యుత్తు వినియోగాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, తదను గుణంగా విద్యుత్తు ఆదా చేయడం ద్వారా బిల్లును కూడా తగ్గించుకోచ్చని తెలిపారు.

విద్యుత్ వినియోగంపై వినియోగదారుల్లో జవాబుదారీతనం పెంపొందుతుందని తెలియజేశారు. దశలవారీగా మిగిలిన కేటగిరీల వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను అమర్చేందుకు చర్యలు చేపడుతామని వివరించారు. సంస్థ డైరెక్టర్ (టెక్నికల్, హెచ్ఎర్రి) కె.గురవయ్య, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్, ఐటి) పి. అయూబ్ ఖాన్, డైరెక్టర్, ఫైనాన్స్ (ఎఫ్ఎసి) రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు ఆదిశేషయ్య, పద్మ, రమణాదేవి, ఉమాపతి, ఎం. మురళి కుమార్, ఎం. కృష్ణారెడ్డి, కె. సంపత్ కుమార్, సిహెచ్ రామచంద్రరావు, జనరల్ మేనేజర్లు సురేంద్రరావు, జగదీష్ చక్రపాణి, లత తదితరులు పాలొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.