రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిధుల లేమి పేరుతో నిలిచిపోకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(CMChandrababu) నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సాంప్రదాయ పద్ధతులకు పరిమితమవకుండా, కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలని సూచించారు. ముఖ్యంగా పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో కొత్త ప్రాజెక్టులను రూపకల్పన చేసి అమలు చేయాలని తెలిపారు.
Read Also: AP: నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్
కొన్ని శాఖలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను పూర్తిగా వినియోగించకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం(CMChandrababu) చేశారు. స్వచ్ఛభారత్ మిషన్ వంటి పథకాల ద్వారా భారీగా నిధులు పొందే అవకాశం ఉన్నప్పటికీ, వాటిని ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.
నెలాఖరులోగా కేటాయించిన పనులను పూర్తిచేసి, అవసరమైతే అదనపు నిధుల కోసం కేంద్రాన్ని సంప్రదించాలని అధికారులకు సూచించారు. సకాలంలో పనులు పూర్తి చేస్తే కేంద్రం నుంచి మరింత నిధులు తీసుకురావడం సాధ్యమవుతుందని సీఎం తెలిపారు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: