📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

CM Pawan kalyan: ఉప్పాడ తీరం కోతకు శాశ్వత పరిష్కారం

Author Icon By Ramya
Updated: July 19, 2025 • 9:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రూ.323 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు.. డి.సిఎం పవన్ కళ్యాణ్

విజయవాడ : ఉప్పాడను చాలాకాలంగా వేధిస్తున్న తీర ప్రాంత కోత సమస్య రూ.323 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు ఎన్డీయే ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (CM Pawan kalyan) చెప్పారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేసారు. పిఠాపురం (Pithapuram) నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న సముద్ర తీర ప్రాంత కోత సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ద్వారా ఉప్పాడలో తీర రక్షణ నిర్మాణాలను అభివృద్ధి చేసే ప్రతిపాదనను సుమారు రూ.323 కోట్ల అంచనా వ్యయంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తోందని తెలిపారు. “గత ఐదేళ్లలో సగటున ఏటా 1.23 మీటర్ల తీరం కోతకు గురైంది, దీంతో సుమారు 12 మీటర్ల తీరం కోల్పోయింది. ఇది సమీప గ్రామాలపై, ముఖ్యంగా మత్స్యకారుల గృహాలపై తీవ్ర ప్రభావం చూపిం ది. ఎన్డీఏ ఎన్నికల వాగ్దానానికి కట్టుబడి, అవసరమైన అనుమతులు లభించిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం అని పవన్ కల్యాణ్ తెలిపారు.

CM Pawan kalyan: ఉప్పాడ తీరం కోతకు శాశ్వత పరిష్కారం

కేంద్రానికి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు.. పిఠాపురం హామీ అమలులో పవన్ కళ్యాణ్ నిబంధనలకూ ఎటూ తలొగ్గలేదు

ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఎంఏ ద్వారా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలను సమర్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తారని, హోం మంత్రి అమిత్ షా కాకినాడ ప్రజల ఆకాంక్షలను గుర్తిస్తారని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉదారంగా సహకరిస్తున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్టు ఆమోదం పొంది, బాధితులకు వారు ఎప్పటి నుంచో కోరుకున్న ఊరట లభిస్తుందని పవన్ కల్యాణ్ (CM Pawan kalyan) తన ట్వీట్లో ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ లో ప్రధాన భాగస్వామిగా ఉంటూనే ప్రజలకు తాను ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడంలో మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా తనను తొలిసారి గెలిపించి అసెంబ్లీకి పంపిన పిఠాపురం నియోజకవర్గం విషయంలో అయితే అస్సలు రాజీపడటం లేదు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం పరిధిలోకి వచ్చే గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.

ఉప్పాడ తీరాన్ని కాపాడేందుకు పవన్ కల్యాణ్ కృషి ఫలించింది – రూ.323 కోట్ల రక్షిత గోడ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఏపీలో గత ఎన్నికల సమయంలో తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఉప్పాడ గ్రామం వద్ద తీర ప్రాంతం భారీగా కోతకు గురవుతున్న విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. దీంతో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తీర ప్రాంతం కోతకు గురి కాకుండా కాపాడతామంటూ పవన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు కేంద్రం వద్దకు ఇక్కడ తీర ప్రాంత రక్షిత గోడ కట్టాలని ప్రతిపాదనలు తయారు చేయించి పంపారు. ఉప్పాడ వద్ద తీర ప్రాంతం కోతకు గురవుతుండటంతో ఈ గ్రామ ప్రజల ఇళ్లు సముద్రంలో కలిసి పోతున్నాయి. అంతే కాదు సముద్రం ఎప్పుడు వచ్చి తమ ఇళ్లను ముంచేస్తుందో, తనలో కలిపేసుకుంటుందో తెలియక ఇక్కడి మత్సకారులకు నిద్రపట్టడం లేదు. ఈ సమస్యను గమనించిన పవన్ కళ్యాణ్ కేంద్రానికి ఉప్పాడ వద్ద రక్షణ గోడ నిర్మాణం కోసం రూ.323 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ పంపిన విజప్తికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. పవన్ కళ్యాణ్ పంపిన ఉప్పాడ రక్షిత గోడ నిర్మాణానికి అవసరమైన రూ.323 కోట్ల నిధుల కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జనసేన పార్టీ తన ఖిఎక్స్డ్ హ్యాండిల్ ఈ విషయాన్ని సంతోషంగా షేర్ చేసింది. కేంద్రం ఇచ్చే నిధులతో ఉప్పాడ వద్ద రక్షిత గోడ నిర్మాణం జరిగితే ఇక అక్కడ గ్రామానికి సముద్ర ముప్పు తొలగిపోతుంది. ముఖ్యంగా తుఫానులు వచ్చినప్పుడు, సముద్ర ఆటుపోట్లకు సైతం తీరం కోతకు గురికాకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ వికీపీడియా ఎవరు?

పవన్ కళ్యాణ్ ఒక ప్రముఖ భారతీయ సినీ నటుడు, రాజకీయ నాయకుడు. ఆయన జనసేన పార్టీ వ్యవస్థాపకుడు మరియు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

ఏపీలో డిప్యూటీ సీఎం ఎవరు?

ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కోనిదెల పవన్ కళ్యాణ్. ఆయన జనసేన పార్టీ నేతగా 14 జూన్ 2024న ఈ పదవికి బాధ్యత స్వీకరించినప్పటికి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక విభాగాలతో పాటు అనేక ముఖ్య విభాగాలను కూడా చేపట్టారు

Read hindi news: hindi.vaartha.com

Read Also: Annavaram: సత్యదేవునికే శఠగోపం!

Andhra Pradesh Development Breaking News coastal protection wall latest news NDA government support Pawan Kalyan Telugu News uppada coastal erosion

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.