📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్

Jagan : జగన్ ది రాక్షసత్వం అంటూ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Author Icon By Sudheer
Updated: December 20, 2025 • 9:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN) ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రజారోగ్యం కోసం, క్రమశిక్షణ కోసం ప్రభుత్వం యోగా వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంటే, దానిపై విష ప్రచారం చేయడం వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. యోగా అనేది ఒక పండుగలా జరగాలని, అది సమాజ శ్రేయస్సు కోసమేనని చెబుతూనే, ప్రతిపక్షాల విమర్శలను ప్రజల ఆరోగ్యానికి వ్యతిరేకమైనవిగా ఆయన అభివర్ణించారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిధుల దుర్వినియోగాన్ని ఎండగడుతూ చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. సామాన్యుడికి ఉపయోగపడే పనుల కంటే, సొంత ప్రచారం కోసం మరియు విలాసాల కోసం వందల కోట్లు ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. రంగురాళ్లపై బొమ్మలు వేయడానికి Rs.700 కోట్లు, ప్రకృతి అందాలైన రుషికొండకు గుండు కొట్టి అక్కడ విలాసవంతమైన ప్యాలెస్ నిర్మాణం కోసం మరో Rs.500 కోట్లు ప్రజా ధనాన్ని తగలేశారని విమర్శించారు. అభివృద్ధి ముసుగులో జరిగిన ఈ భారీ వ్యయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారం మోపిందని, ఇలాంటి వారు నేడు ప్రభుత్వం చేసే మంచి పనులను వేలెత్తి చూపడం విడ్డూరంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest News: Cyber Crime: సైబర్ మోసానికి గురైన మహాభారత్ నటుడు గజేంద్ర చౌహాన్

రాష్ట్ర అభివృద్ధికి తాము చేపడుతున్న పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నాలను తాము ఉపేక్షించబోమని సీఎం స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో విద్యా సంస్థలు, కాలేజీలు నిర్మిస్తుంటే వాటిని అడ్డుకుంటామని, అధికారులను జైల్లో పెడతామని ప్రతిపక్షం బెదిరించడం వారి రాక్షసత్వానికి నిదర్శనమని అన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని బెదిరింపులకు దిగినా ఏపీ అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Chandrababu Chandrababu's sensational comments Google News in Telugu Jagan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.