📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

CM Chandrababu: విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

Author Icon By Saritha
Updated: March 11, 2026 • 2:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

CM Chandrababu: రాష్ట్రంలో పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తూ, కీలక మార్పులకు శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. బుధవారం సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. గడిచిన 20 నెలల్లో పాలనలో కీలకమైన మార్పులు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌లో భాగంగా 10 సూత్రాల అమలు తీసుకొచ్చామని గుర్తుచేశారు. నిర్దేశిత లక్ష్యాలను క్షేత్ర స్థాయిలో ప్రభావవంతంగా అమలు చేయాలి.

Read Also: Jagan Mohan Reddy: ఆదాయాలు తగ్గినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చాము

CM Chandrababu: We will reduce electricity charges further.. CM

విద్యుత్ ఛార్జీల భారం మరింత తగ్గింపు

ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలు, పథకాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయని.. సూపర్‌ సిక్స్‌ సహా వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని, పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. నిర్దేశిత లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రభావవంతంగా, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా అమలు చేయాలని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను మరింత తగ్గిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ట్రూఅప్‌ పేరిట ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారం మోపారని చంద్రబాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక ట్రూడౌన్‌ చేశామని, విద్యుత్ చార్జీల భారం మరింత తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh CM Chandrababu naidu Collectors Conference electricity charges Swarnandhra 2047

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.