📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

CM Chandrababu: జనాభా పెరుగుదలపై ఫోకస్ చేస్తున్నాం..

Author Icon By Anusha
Updated: July 11, 2025 • 3:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశానికి అతి పెద్ద ఆర్థిక వనరు జనాభానే అని ఆయన స్పష్టం చేశారు. జనాభా విషయంలో గతంలో ఉన్న అపోహలు తొలగిపోతున్నాయని, ఇప్పుడు అధిక జనాభా ఉన్న దేశాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల స్థిరపడుతున్నదని చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. “అమెరికాలో ఫర్టిలిటీ రేటు కేవలం 1.62% మాత్రమే ఉంది. జనాభా స్థిరంగా ఉండాలంటే కనీసం 2.1% ఉండాల్సిందే. లేకపోతే జనాభా తగ్గుతుంది,” అని వివరించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో

మన దేశంలో బీహార్ లో ఫర్టిలిటీ రేటు 3 శాతంగా ఉందని, ఏపీలో 1.7 శాతానికి చేరుకుందని చెప్పారు. ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసేవారని, ఇప్పుడు ఎక్కువ జనాభా ఉన్న దేశాలకు గౌరవం దక్కుతోందని చంద్రబాబు అన్నారు. గతంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) పోటీ చేసేందుకు వీలు లేదనే చట్టాన్ని తాను తీసుకొచ్చానని, ఇప్పుడు జనాభా పెరుగుదలను తానే సమర్థిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో జనాభా పెరుగుదలపై దృష్టి సారించామని తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

CM Chandrababu: జనాభా పెరుగుదలపై ఫోకస్ చేస్తున్నాం..

జనాభా స్థిరంగా

ప్రపంచ దేశాలు ఇప్పుడు స్కిల్డ్ మానవ వనరుల కోసం పోటీ పడుతున్నాయని, భారతదేశానికి ఈ విషయంలో పెద్ద అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు పెంచి, యువతను ప్రొడక్టివ్ ఫోర్స్‌గా మార్చుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు.చివరిగా, చంద్రబాబు మాట్లాడుతూ, “మన రాష్ట్రం (State) లో జనాభా స్థిరంగా పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. సమతుల్యతతో కూడిన అభివృద్ధికి ఇది అవసరం. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇది కీలకం,” అని చెప్పారు.

చంద్రబాబు నాయుడుకి చెందిన కంపెనీ ఏది?

తెలుగుదేశం పార్టీ అధినేత మరియు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థాపించిన కంపెనీ పేరు హెరిటేజ్ గ్రూప్ (Heritage Group). ఈ గ్రూప్‌ను ఆయన 1992లో ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తి ఎవరు?

తెలుగుదేశం పార్టీకి చెందిన నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన వ్యక్తి.ఈయన తరువాత అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్నది కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Murder: యజమానిని హతమార్చి డబ్బు ,నగలతో ఉడాయించిన పనిమనిషి ..ఎక్కడంటే?

AP population growth Breaking News Chandrababu Naidu speech India fertility rate 2025 latest news Telugu News World Population Day 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.