CM Chandrababu Vizianagaram Visit: ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు:రాంసుందర్ రెడ్డి

Read Time:  1 min
CM Chandrababu Vizianagaram Visit: సీఎం పర్యటన.. హెలిప్యాడ్, రోడ్ల నిర్మాణంపై కలెక్టర్ కీలక ఆదేశాలు
CM Chandrababu Vizianagaram Visit: సీఎం పర్యటన.. హెలిప్యాడ్, రోడ్ల నిర్మాణంపై కలెక్టర్ కీలక ఆదేశాలు
FONT SIZE
GET APP

CM Chandrababu Vizianagaram Visit: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 28వ తేదీన విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన చీపురుపల్లి మండలానికి రానున్నారు. ఈ నేపథ్యంలో, రావివలస సమీపంలోని పైలపేట వద్ద ప్రతిపాదిత బహిరంగ సభా స్థలాన్ని, హెలిప్యాడ్ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సోమవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Read also: Railway Parcel Booking: ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!

అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

సభా ప్రాంతానికి సంబంధించిన మ్యాపులను పరిశీలించిన కలెక్టర్, గ్రామ సమీపంలోని లేఅవుట్‌లో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని సూచించారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలపై ఏఎస్పీ సౌమ్యలతతో చర్చించారు. అలాగే, సభా ప్రాంగణానికి కలుపుతూ నిర్మాణంలో ఉన్న రహదారులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.

CM Chandrababu Vizianagaram Visit
CM Chandrababu Vizianagaram Visit: CM’s visit.. Collector’s key instructions on construction of helipad and roads

పాల్గొన్న ముఖ్య అధికారులు

ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, ఇంచార్జి ఆర్డీవో ప్రమీల గాంధీ, పి.ఆర్. ఎస్ఈ శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఎస్ఈ కాంతిమతితో పాటు రెవెన్యూ, పోలీస్, సర్వే శాఖల అధికారులు మరియు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.