CM Chandrababu Visit Cheepurupalli: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నిమిత్తం చీపురుపల్లి మండలం రావివలస, పైలపేట గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Read also: Satyakumar Yadav: కిడ్నీ రోగులకు ఏపీ సర్కార్ భరోసా
పర్యటన వివరాలు ఇవే
ముఖ్యమంత్రి శనివారం ఉదయం 11.10 గంటలకు రావివలస గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా చీపురుపల్లి సి.హెచ్.సి (CHC) కి చేరుకొని, అక్కడ నిర్వహించనున్న హెచ్.పి.వి (HPV) వ్యాక్సిన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రజావేదిక వద్దకు చేరుకొని, ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించే హెచ్.పి.వి వ్యాక్సిన్ ప్రారంభోత్సవ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు.
నేరుగా ఇంటికే వెళ్లి పింఛన్ పంపిణీ
ప్రజావేదిక సమావేశం అనంతరం, సీఎం చంద్రబాబు పైలపేట శివారు గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లనున్నారు. అక్కడ ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్లను స్వయంగా అందజేస్తూ, లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు.
జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ
విజయనగరం జిల్లాలో ఫిబ్రవరి 28న మొత్తం 2,69,748 మందికి రూ. 114.83 కోట్ల పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. చీపురుపల్లి నియోజకవర్గంలో 36,903 మందికి రూ. 15.80 కోట్లు పంపిణీ చేయనున్నారు. రావివలస స్వర్ణ గ్రామం పరిధిలో 387 మందికి రూ. 16 లక్షలను అందజేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: