తొమ్మిది జిల్లాలతో కూడిన విశాఖ ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్) ను ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా (గ్లోబల్ ఎకనమిక్ హబ్) తీర్చిదిద్దేందుకు పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 2032 నాటికి ఈ ప్రాంతాన్ని 135 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, తద్వారా 30 లక్షల ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా నిర్దేశించారు. వీఈఆర్ అభివృద్ధిపై శుక్రవారం విశాఖలో మంత్రులు, 9 జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన తొలిసారి సమీక్షా సమావేశం నిర్వహించారు.
Read Also: CM Chandrababu To Visit Delhi : ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు
గ్రోత్ డ్రైవర్ల ద్వారా అభివృద్ధి
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు దీని పరిధిలో ఉన్నాయి. APలో 31% విస్తీర్ణం, 23% జనాభాతో GDPలో 30% భాగస్వామ్యం VERదే. గ్లోబల్ పోర్ట్, నెక్ట్స్‌జెన్ ఐటీ, అగ్రికల్చర్, టూరిజం, హెల్త్ కేర్ వంటి 7 గ్రోత్ డ్రైవర్ల ద్వారా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: