📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: CM Chandrababu: పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం

Author Icon By Pooja
Updated: October 14, 2025 • 10:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకట్టుకోవడం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడంతో పాటు సరికొత్త ఆలోచనలకు సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక కావాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) సూచించారు. ఆంధ్రప్రదేశను భారత ఆర్థిక, సాంకేతిక ప్రగతిలో అగ్రగామిగా ప్రతిష్ఠించడమే లక్ష ్యమని స్పష్టం చేశారు.

Read Also: Today Gold Rate 14/10/25 : బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి

విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సన్నాహకాలపై సచివాలయంలో సోమవారం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సీఐఐ సదస్సుకు ముఖ్య అతిధిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని నిర్ణయించినట్టు సీఎం(CM Chandrababu) తెలిపారు. అలాగే వివిధ దేశాల వాణిజ్య మంత్రులను, లీడింగ్ గ్లోబల్ సీఈవోలను ఆహ్వానించాలని నిర్దేశించారు. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, పాలసీ థింకర్లు, అకడమిక్స్ సదస్సులో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్లోబల్ టెక్ ట్రాన్స ఫర్మేషన్, గ్లోబల్ ట్రస్ట్ పెంచుకోవడం, గ్లోబల్ ట్రేడ్లో(global trade) దేశం వాటా పెరగడం సదస్సు లక్ష ్యంగా ఉండాలని సూచించారు. అతిథులకు అన్ని సౌకర్యాలతో ఆతిథ్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని, విశాఖ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పారు. గీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. అలాగే గూగుల్ వంటి అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయి.


రాష్ట్రం త్వరలోనే కృత్రిమ మేధస్సు, ఇన్నోవేషన్ హబ్ గా మారనుంది. సదస్సులో ఈ అంశాలు, రాష్ట్ర ఆకాంక్షలు ప్రతిబింబించాలి. సదస్సు ఏర్పాట్లకు సమయం తక్కువ ఉన్నందున… వేగంగా పనులు పూర్తి చేయాలి. అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు నవ్యాంధ్రప్రదేశ్లో నిర్వహించడం ఇది 4వ సారి. గతంలో 2016, 2017, 2018లో మూడు సార్లు విశాఖలోనే నిర్వహించారు. ఇప్పుడు విశాఖనే సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈసారి సీఐఐ సదస్సు టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్ నావిగేటింగ్ ది జియో ఎకనామిక్ ఆర్డర్డ్ థీమ్ మొత్తం 13 సెషన్లుగా జరగనుంది. 29 మంది వాణిజ్య మంత్రులు, 80 మంది దేశ, విదేశీ సీఈవోలు, 40 దేశాల నుంచి ప్రతినిధులు, అలాగే 13 మంది కేంద్ర మంత్రులు ఈ సదస్సుకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. జీ20 దేశాలు, మిడిల్ ఈస్ట్, యూరప్, ఆసియా, పశ్చిమాసియా తదితర ప్రాంతాల నుంచి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ట్రేడ్, జియోఎకనామిక్ ఫ్రేమ్ వర్క్, టెక్నాజజీఇన్నోవేషన్, డిఫెన్స్, ఏరోస్పేస్, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ, స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్ సప్లయ్ చైన్, సస్టెయినబిలిటీక్లీన్ ఎనర్జీ, లెవరేజింగ్ టెక్నాలజీ అంశాలపై సెషన్లు జరుగుతాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Andhra Pradesh Investments CII partnership Latest News in Telugu Today news Visakhapatnam summit

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.