📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: CM Chandrababu: రెండేళ్లలో అమరావతిలో వేంకటేశ్వర ఆలయం పూర్తి: సీఎం

Author Icon By Anusha
Updated: November 27, 2025 • 2:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ విస్తరణ పనులకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శంకుస్థాపన చేశారు.. దేవతల రాజధాని అమరావతి అని, మన రాజధానికి అమరావతి (Amaravati)పేరు పెట్టే అవకాశం దేవుడు తనకిచ్చారని సీఎం చంద్రబాబు (CM Chandrababu) చెప్పారు. ‘ఈ ప్రాంతాన్ని కాపాడే శక్తి ఈ గుడికి ఉంది.

Read Also: YV Subba Reddy: నేను ఏ తప్పు చేయలేదు..పాలీగ్రాఫ్ టెస్టుకు సిద్ధం

CM Chandrababu: Venkateswara temple in Amaravati to be completed in two years

దేవతల రాజధాని

రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని టీటీడీ (TTD) ని కోరుతున్నా. ఈ పవిత్ర కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి. ఆరోగ్యం, సంపద, ఆనందం ప్రతిఒక్కరికీ ఇవ్వాలని స్వామిని వేడుకుంటున్నా’ అని (CM Chandrababu) పేర్కొన్నారు.

మొత్తం రూ.260 కోట్ల అంచనా వ్యయంతో రెండు దశల్లో ఈ పనులను చేపట్టనున్నారు. తొలి దశలో రూ.140 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం, ఏడంతస్తుల మహారాజగోపురం, వివిధ మండపాలు, పుష్కరిణి వంటివి నిర్మించనున్నారు. రెండో దశలో రూ.120 కోట్లతో మాడ వీధులు, అన్నదాన సత్రం, యాత్రికుల వసతి సముదాయాలు, పరిపాలన భవనం వంటివి నిర్మిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Amaravati AP Capital Chandrababu Naidu latest news Telugu News TTD Temple Works

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.