📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

CM Chandrababu: రేపు పలువురు మంత్రులతో భేటీ కానున్న సీఎం

Author Icon By Saritha
Updated: February 9, 2026 • 12:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) మరోసారి ఢిల్లీకు బయల్దేరుతున్నారు. ఈ సాయంత్రం 7.20 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఆయన విమానం బయల్దేరనుంది. రాత్రి 9.35 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రి 1-జన్ పథ్‌లోని నివాసంలో ఆయన బస చేస్తారు. రేపు ఉదయం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ నిర్వహించనున్నారు.

Read Also: AP Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీ ప్రారంభం.. 88 వేల ఉద్యోగాలు!

The Chief Minister will be meeting with several ministers tomorrow.

16న ఏపీ పర్యటనకు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్

పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ ఉన్న బకాయిల విడుదల, పోలవరం పునరావాస ప్యాకేజీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో చర్చించనున్నారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయించిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్మలా సీతారామన్ ను (Nirmala Sitharaman) కోరనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన బ్యాంకు రుణాల ప్రక్రియ, కేంద్రం నుంచి అందాల్సిన వివిధ రకాల గ్రాంట్లపై చంద్రబాబు (CM Chandrababu) చర్చించనున్నారు.

16న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీ పర్యటనకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇతర అంశాలను కేంద్రం దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లనున్నారు. అనంతరం రేపు సాయంత్రం 5 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి బయల్డేరి 8 గంటలకు విజయవాడ చేరుకుంటారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Amit Shah Andhra Pradesh Chief Minister Central Government Meetings CM Chandrababu naidu Delhi Visit Latest News in Telugu Nirmala Sitharaman Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.