📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

CM Chandrababu: రైల్లో అగ్నిప్రమాదంపై స్పందించిన సీఎం

Author Icon By Saritha
Updated: December 29, 2025 • 4:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాటానగర్–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో(CM Chandrababu) జరిగిన అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రమాదం జరిగిన వెంటనే యలమంచిలి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు, ఆర్‌పీఎఫ్ సిబ్బంది సమన్వయంతో వేగంగా స్పందించిన తీరును సీఎం ప్రశంసించారు. వారి అప్రమత్తత, వృత్తిపరమైన నైపుణ్యం వల్ల 150 మందికిపైగా ప్రయాణికులను సురక్షితంగా రక్షించగలిగామని పేర్కొన్నారు. మంటలు ఇతర కోచ్‌లకు వ్యాపించకుండా వెంటనే కోచ్‌లను వేరుచేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. అయితే ఈ ఘటనలో ఒకరు మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని, మృతుడి కుటుంబానికి తన హృదయపూర్వక సానుభూతిని తెలిపారు.

Read also: Karveti Nagaram temple: ముక్కోటి వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్దం

The Chief Minister responded to the train fire incident.

రైళ్ల రాకపోకలకు అంతరాయం

సోమవారం తెల్లవారుజామున అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న 18189 ఎక్స్‌ప్రెస్ రైలులోని బీ1, బీ2 అనే రెండు ఏసీ కోచ్‌లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. (CM Chandrababu) ఈ ఘటనలో బీ1 కోచ్‌లో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) మృతి చెందారు. మంటలను గుర్తించిన లోకో పైలట్లు వెంటనే రైలును ఆపడంతో ప్రయాణికులు అప్రమత్తమై బయటకు రావడంతో మరింత ప్రాణనష్టం తప్పింది. వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాదానికి గురైన రెండు కోచ్‌లను రైలు నుంచి వేరు చేసి, మిగతా రైలును సామర్లకోటకు పంపించారు. అక్కడి నుంచి ప్రయాణికుల కోసం ఏర్పాట్లు చేశారు. ఈ ప్రమాదం కారణంగా విశాఖపట్నం-విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించి, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను అన్వేషిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Pradesh News CM Chandrababu naidu Latest News in Telugu Passenger rescue Railway Safety Tatangar–Ernakulam Express Telugu News train fire accident Yalamanchili Incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.