ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) రెండు రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సు గురువారంతో ముగిసింది. ఈ సమావేశంలో పాలన, అభివృద్ధి, శాంతి భద్రతలు, సంక్షేమ పథకాల అమలు వంటి అనేక కీలక అంశాలపై విస్తృత చర్చ జరిగింది. (CM Chandrababu) ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశాలు జారీ చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల సంతృప్తే పాలనకు అసలైన కొలమానం అని ఆయన స్పష్టం చేశారు. అధికారులు నివేదించే గణాంకాలకన్నా ప్రత్యక్ష పనితీరుపైనే తాను విశ్వసిస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు. అవసరమైతే ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి నిలబెట్టగలిగామని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ నుంచి సంక్షేమ క్యాలెండర్‌ను అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కేంద్ర నిధులను సమర్థంగా వినియోగించడంతో పాటు అదనంగా రూ.5 వేల కోట్ల నిధులు సమీకరించేలా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఉత్తమ పాలనా విధానాలు అమలు చేసిన ఆరు జిల్లాల కలెక్టర్లతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించి, ఆ విధానాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు.
Read Also: AP: కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేసిన తండ్రి!
శాంతి భద్రతలపై కఠిన ఆదేశాలు
22ఏ భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక లక్ష్యంతో పని చేయాలని సీఎం కలెక్టర్లకు సూచించారు. (CM Chandrababu) ఈ భూముల పేరుతో వివాదాలు సృష్టించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఏపీఐఐసీకి చెందిన వేల ఎకరాల భూములను 22ఏ నుంచి విముక్తి చేసే చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. భూవివాదాల్లో రాజకీయ జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కలెక్టర్లు, ఎస్పీలకు హెచ్చరించారు.
అదనంగా, పట్టాదారు పాస్‌బుక్కులు, రిజిస్ట్రేషన్ పత్రాలను ఇకపై కొరియర్ ద్వారా యజమానులకు అందించాలని సూచించారు. ఉగాది నాటికి ఫ్యామిలీ కార్డులు జారీ చేయాలని, జీరో సూసైడ్స్ లక్ష్యంగా కౌన్సిలింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. నేరాల నియంత్రణలో భాగంగా నోటోరియస్ రౌడీలపై కఠిన చర్యలు, ఫేక్ ప్రచారాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కన్విక్షన్ రేటు పెరగాలి, క్రైమ్ రేటు తగ్గాలని సీఎం స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: