📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest news: CM Chandrababu: జీర్ణోద్ధరణ ఆలయాలకు పూర్వ వైభవం

Author Icon By Saritha
Updated: November 28, 2025 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: ప్రపంచం నలుచెరగులా(CM Chandrababu) తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీని(TTD) ఆదేశించారు. ఆధ్యా త్మికం, అన్నదానం, విద్య, వైద్యానికి చిరునామాగా తిరుమల తిరుపతి దేవ స్థానం మారాలని సూచించారు. గురువారం సచివాలయం లో దేవాదాయశాఖ, తిరుమల తిరుపతి దేవస్థానంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తిరుమల ఆలయంలో అనుసరించే అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో అమలు చేసేందుకు ఆలోచన చేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రసాదం తయారీ, క్యూ మేనేజ్మెంట్ సిస్టం సహా వివిధ అంశాల్లో ఈ విధానాలను అను సరిం చాలని దేవాదాయశాఖకు సూచనలు చేశారు. ప్రసాదాల తయారీ కోసం ఆర్గానిక్ ఉత్పత్తులను ఎంచుకోవాలని సీఎం స్పష్టం చేశారు. తిరుమలలో భక్తుల నిర్వహణకు సంబంధించి సాంకేతికతను వినియోగించాలని పేర్కొన్నారు. భక్తులకు దర్శన సౌలభ్యం కల్పించటమే ప్రధాన దేవాలయాల్లో ప్రణాళికలు ఉం డాలని తిరుమల తరహా విధానాలు
సూచనలు చేశారు. టీటీడీ భక్తుల పోర్టల్ ఆర్టీజీఎస్ తో అనుసం ధానిం చాలని ఆదేశింనుచారు.

Read also: సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఢిల్లీకి రావడానికి సిద్ధం

The former glory of the digestive temples

ఆస్పత్రులను మోడల్‌గా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశాలు

తిరుపతిలో(CM Chandrababu) ఉన్న ఆస్పత్రులన్నీ ఓ మోడల్ గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రులను అనుసంధానిస్తూ మెరుగైన వసతులు కల్పించాలని అన్నారు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఆస్పత్రుల తరహాలోనే వీటి నిర్వహణ కూడా చేపట్టాలని సీఎం సూచించారు. అత్యుత్తమ వైద్య నిపుణులైన డాక్టర్లను కూడా శ్రీవారి సేవకులుగా ఆహ్వానించి ఈ ఆస్పత్రుల ద్వారా వైద్య సేవ చేసేందుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి టీటీడీని ఆదేశించారు. అలాగే నేరుగా ఉత్పత్తిదారుల నుంచే ఔషధాలు కొనుగోలు చేసేలా చూడాలన్నారు. అత్యవసర సమయాల్లో క్యూలైన్లలోని భక్తులను వేగంగా ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తిరుమల లో కాలుష్య నివారణకు ఈవీ వాహనాలు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలను నిర్వహించాలని అన్నారు. అలాగే అన్ని సేవల్నీ వాట్సప్ గవర్నెన్సు లోకి తీసుకువచ్చి భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు.

దేవాలయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి కీలక సూచనలు

వైకుంఠ ఏకాదశికి పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని ఎక్కడా సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని టీటీడీకి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వైకుంఠ ఏకాదశికి అన్ని భాషల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని సూచనలు చేశారు. వీలైనంత తిరుమల మంది ఎక్కువ భక్తులు దర్శనాలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆధ్వర్యంలో నడిచే అన్ని దేవాలయాల్లో నిత్యాన్నదానం జరిగేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. తిరుమలలో దివ్య ఔషధవనం, బయోడైవర్సిటీ కాపాడేలా చర్యలు చేపట్టాల న్నారు. తిరుమల కొండలపై వివిధ రకాల పుష్పజాతుల మొక్కలు నాటాలన్నారు. రాష్ట్రం లో కొత్తగా నిర్మించనున్న 5 వేల దేవాల యాలను రీడిజైన్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఆ దేవాలయాల్లో ఆధ్యాత్మికత, ప్రశాం తత ఉట్టిపడేలా ప్రత్యేకంగా ప్రణాళిక చేయాలని సూచించారు. వీటి నిర్మాణాన్ని పాలకమండలి సభ్యుల కమిటీ పర్యవేక్షి చూడాలన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Temples Chandrababu Naidu Latest News in Telugu Spiritual development Temple renovation Tirumala temple TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.