📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

CM Chandrababu: రూ.100 చెల్లిస్తే చాలు వారసత్వ భూములకు సెక్షన్‌ సర్టిఫికెట్‌:చంద్రబాబు నాయుడు

Author Icon By Sharanya
Updated: July 7, 2025 • 1:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ విభాగంలోని సమస్యలను సమూలంగా పరిష్కరించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో నూతన దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం భూసమస్యల పరిష్కారానికి (resolve land issues) సమగ్ర ప్రణాళికను రూపొందించింది. ఆధార్ నంబర్లు, సర్వే నంబర్లతో భూ రికార్డుల అనుసంధానం ద్వారా వ్యవస్థను డిజిటలైజ్ చేయడం ఈ ప్రణాళికకు కీలకం కానుంది.

AI ఆధారిత వ్యవస్థ – భూసమస్యల పరిష్కారానికి మార్గం

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్‌. ఆధార్‌, సర్వే నెంబర్లను అనుసంధానించి భూ సమస్యల చిక్కుముళ్లను విప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమస్యల పరిష్కారానికి అక్టోబర్‌ 2ని డెడ్‌లైన్‌గా పెట్టుకుని పని చేయాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశించారు. ఈ క్రమంలో వారసత్వ భూములకు సెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రెవెన్యూ శాఖపై సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.10లక్షల వరకు విలువైన వారసత్వ భూములకు సచివాలయంలో రూ.100 చెల్లించి సెక్షన్‌ సర్టిఫికెట్లు (Section certificates by paying Rs. 100) పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు.

పాస్‌బుక్స్‌లో మార్పులు – రంగుల పద్ధతి

ప్రతి భూమికి సంబంధించి సమగ్ర సమాచారం ఉండేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సమీక్షలో నిర్ణయించారు. క్యూఆర్‌ కోడ్‌ ఉండే పాస్‌ పుస్తకాలు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు వివిధ రకాల భూములకు రంగుల పాస్‌బుక్కులు కేటాయించాలని నిర్ణయించారు ఆగస్టు 15 నుంచి ఉచితంగా వాటిని పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

రెవెన్యూ విభాగ పునర్‌నిర్మాణం

ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ఉన్న ఫ్రీ హోల్డ్ భూములు, రైతులకు కొత్త పాస్ బుక్స్, రెవెన్యూశాఖలో ఉన్న సమస్యలు, భూ సంస్కరణల పై సమీక్ష నిర్వహించారు భూసమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై రివ్యూ చేశారు. రెవెన్యూ శాఖలో మార్పులు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రెవెన్యూ యంత్రాంగంలో ఉద్యోగులు, అధికారుల కొరత, పనిభారం వంటి అంశాలపై సమీక్షా సమావేశంలో చర్చ జరిగింది.

రీసర్వే లక్ష్యం – డిసెంబర్ 2027 వరకు

ముఖ్యంగా భూముల రీసర్వే 2027 డిసెంబర్‌ నాటికి రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రతి పేదవాడికి నివాసయోగ్యమైన ఇల్లు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి అనగాని. ఇక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయించామని అనగాని తెలిపారు.

రూ. 10లక్షలు దాటిన భూములకు రూ.వెయ్యి చెల్లించి సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలను ఆగస్టు 2లోగా మంజూరు చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. మెజార్టీ రెవెన్యూ సమస్యలను అక్టోబరు 2లోగా పరిష్కరించాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: YS Jagan: ఈరోజు కడప జిల్లాకు జగన్ రాక

Jagan : జగన్ చిత్తూరు పర్యటనకు పోలీసుల అనుమతి

#AIinGovernance #AndhraPradesh #APDevelopment #ChandrababuNaidu #cmchandrababu #DigitalGovernance #HeritageLand #LandReforms #RevenueReforms #SectionCertificate Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.