📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

CM Chandrababu: నదీ జలాలు వృథా కాకూడదు

Author Icon By Pooja
Updated: January 5, 2026 • 2:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతి సంవత్సరం కృష్ణా, గోదావరి వంటి ప్రధాన నదుల నుంచి వేల టీఎంసీల నీరు వినియోగం లేకుండా సముద్రంలో కలిసిపోతుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి దేశానికి పెద్ద నష్టమని పేర్కొంటూ, నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Read Also: TDP Joining: వైసీపీకీ భారీ షాక్ ఇచ్చిన అనంతపురం మైనార్టీలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పాలనలోనే అనేక కీలక జల ప్రాజెక్టులకు తాము శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేసిన సీఎం, అప్పట్లోనే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో(CM Chandrababu) పెట్టుకుని ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఇప్పటికీ నీరు వృథా కాకుండా వినియోగించేందుకు ఎవరైనా ముందుకు వస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నీటి కొరత సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం కావాలంటే నదుల అనుసంధానం అత్యవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గంగా–కావేరీ, గోదావరి–పెన్నా వంటి నదులను కలపడం ద్వారా నీటి వనరులను సమతుల్యంగా పంచుకోవచ్చని సూచించారు. ఈ విధానం అమలైతే సాగునీటి అవసరాలు తీరడమే కాకుండా, తాగునీటి సమస్య కూడా గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. నదుల అనుసంధాన ప్రాజెక్టులు భవిష్యత్ తరాలకు నీటి భద్రతను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, ఇది దేశ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu IrrigationProjects Latest News in Telugu WaterResources

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.