📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Latest News: CM Chandrababu: అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు విధాన నిర్ణయం తీసుకోవాలి: సీఎం

Author Icon By Aanusha
Updated: November 25, 2025 • 7:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధికారులను ఆదేశించారు.కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని ‘జీరో పొల్యూషన్’ స్థాయికి తీసుకురావడమే లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.కాలుష్య నియంత్రణ నిబంధనలను అతిక్రమించే సంస్థలు, వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోకుండా, ముందుగా హెచ్చరికలు జారీ చేయాలని సీఎం (CM Chandrababu) సూచించారు.

Read Also: AP: రాష్ట్రంలో కొత్త జిల్లాలు, 4 రెవెన్యూ డివిజన్లు!

ఆ తర్వాత కూడా మార్పు రాకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బయో వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని, గాలి (Air) నాణ్యతను పర్యవేక్షించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించాలని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Speed ​​of doing business) విధానానికి తగ్గట్టుగా అనుమతులివ్వాలని దిశానిర్దేశం చేశారు. రెడ్ జోన్ పరిధిలోని పరిశ్రమలకు 12 రోజుల్లో, ఆరెంజ్ జోన్‌కు 10 రోజుల్లో, గ్రీన్ జోన్‌కు 3 రోజుల్లోనే అనుమతులు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు.

CM Chandrababu: Policy decision should be taken to eliminate all types of plastic waste

రాష్ట్రంలోని అన్ని మురుగునీటి శుద్ధి కేంద్రాలను (సివరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు) త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలని ఆదేశించారు. గాలి, నీరు, ఇండస్ట్రీయల్ వేస్ట్, బయో వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ వంటి వాటిల్లో వివిధ రకాల అధ్యయనం చేయాలని సూచించారు. అందుకుగాను ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని వివరించారు.

పర్యావరణహితమైన బయోషీట్లు వాడేలా రైతులు అవగాహన

పంట పొలాల్లో రైతులు ప్లాస్టిక్ షీట్లకు బదులుగా పర్యావరణహితమైన బయోషీట్లు వాడేలా ప్రోత్సహించాలని, దీనిపై వారికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలికి సిబ్బంది కొరత ఉందని సంస్థ ఛైర్మన్ కృష్ణయ్య సీఎం దృష్టికి తీసుకురాగా, అవసరమైన సిబ్బంది నియామకానికి ఆయన వెంటనే అంగీకారం తెలిపారు. 

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh pollution control Chandrababu Naidu latest news plastic waste management Telugu News zero pollution mission

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.