📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

CBN : నేడు ఢిల్లీ లో సీఎం చంద్రబాబు బిజీ బిజీ

Author Icon By Sudheer
Updated: October 1, 2025 • 11:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN) ఇవాళ ఢిల్లీకి పయనమవుతున్నారు. విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల సదస్సును నిర్వహించనుంది. ఈ సదస్సు ద్వారా దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆకర్షించి, భారీ పెట్టుబడులు రాబట్టడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనను చేపట్టి, ప్రముఖ పారిశ్రామికవేత్తలను, పరిశ్రమల ప్రతినిధులను వ్యక్తిగతంగా ఆహ్వానించనున్నారు.

ఇప్పటికే విశాఖపట్నం రాష్ట్ర ఆర్థిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో ఈ పెట్టుబడుల సదస్సుకు విశేష ప్రాధాన్యం లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల విస్తరణ, స్కిల్ డెవలప్‌మెంట్, ఐటీ, తయారీ రంగాల్లో అవకాశాలను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తోంది. ఢిల్లీలో ముఖ్యమంత్రి ఈ అంశాలను వివరిస్తూ పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంపొందించనున్నారు. కేంద్రంతో కలిసి పారిశ్రామికాభివృద్ధి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడం ద్వారానే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపుని అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

vaartha live news : Mudskippers : చెట్లను ఎక్కే వింత చేప

పర్యటనలో భాగంగా సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో చంద్రబాబు సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక, విధానపరమైన మద్దతు, కొత్త ప్రాజెక్టులకు ఆమోదం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో రాత్రి బస చేసిన అనంతరం ముఖ్యమంత్రి రేపు విజయనగరం జిల్లా దత్తి గ్రామానికి చేరుకుని పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పర్యటనతో పెట్టుబడుల సదస్సు ఏర్పాట్లకు ఊపుదొరుకుతుందనే కాకుండా, ప్రజలతో నేరుగా మమేకమై సంక్షేమ పథకాలను పరిశీలించే అవకాశమూ లభిస్తోంది.

Chandrababu delhi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.