FSSAI Lab Tirumala Inauguration: తిరుమల శ్రీవారి భక్తులకు వడ్డించే అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. తిరుమలలో అత్యంత ఆధునిక సాంకేతికతతో నిర్మించిన FSSAI (భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ) ల్యాబ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
Read Also: AP Liquor Scam: అవినాశ్ రెడ్డికి బెయిలు మంజూరు
తిరుమలలో పిండిమర ప్రాంతంలో ఈ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌లో నీరు, ఆహారపదార్థాలు, ముడి సరకుల నాణ్యతపై పరీక్షలు చేస్తారు. మొత్తం 12 వేల చదరపు అడుగుల్లో రెండంతస్తుల్లో, రూ. 20 కోట్లతో అత్యంత ఆధునిక యంత్రాలతో వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ నిర్మించారు. తిరుమలలో భక్తులకు లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదాలను మరింత నాణ్యతగా, రుచిగా అందించేందుకు.. నీరు, ముడిసరుకులు, ఇతర పదార్థాల నాణ్యతను పరీక్షించేందుకు ఈ ల్యాబ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ముడిసరుకుల్ని పరీక్షించేలా
ఏపీ ప్రభుత్వం 2024 అక్టోబరు 8న ఎఫ్‌ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)తో ఒప్పందం చేసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిరుమలలో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌లో ప్రధానంగా ప్రసాదాల్లో వినియోగించే ముడిసరుకుల్ని పరీక్షించేలా ల్యాబ్ ప్లాన్ చేశారు. దేశంలోనే తొలిసారి ఒక ఆలయంలో ల్యాబ్ ఏర్పాటు చేసిన ఘనత దక్కింది.ఈ ల్యాబ్‌లో అత్యాధునిక పరికరకాలు ఉన్నాయి. ఈ ల్యాబ్‌లో యాంటీ బయోటిక్స్, పురుగు మందుల అవశేషాలు, లెడ్ ఆర్సెనిక్ వంటి వాటిని గుర్తించే పరికరాలు ఉన్నాయి.
ఈ ల్యాబ్‌కు త్వరలోనే ఫ్రాన్స్ నుంచి రూ.3 కోట్ల విలువైన ఈ-నోస్, ఈ-టంగ్ పరికరాలు కూడా రాబోతున్నాయి. తిరుమలలో అందించే జలప్రసాదం శాంపిల్స్ కూడా ఈ ల్యాబ్‌లో పరీక్షిస్తారు. అంతకముందు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. తిరుమలలో భక్తులకు వేగంగా శ్రీవారి దర్శనం జరిగేలా కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచనలు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: