Chandrababu Naidu Iftar Party Photos: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని ‘ఏ ప్లస్ కన్వెన్షన్’లో సోమవారం ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు
Read Also: Statue of Sacrifice: అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం.. మాట నిలబెట్టుకున్న లోకేశ్!
ముస్లిం మైనార్టీల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల దురాక్రమణను అరికట్టి, వాటిని పరిరక్షించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గత 21 నెలల పాలనలో ముస్లింల సంక్షేమం కోసం అమలు చేసిన పలు పథకాలను చంద్రబాబు వివరించారు. విద్య, ఉపాధి రంగాల్లో మైనార్టీ యువతకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.





వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.




ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ముస్లింల సంక్షేమానికి, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: