📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’

CM Chandrababu: సంగీతం, సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు

Author Icon By Saritha
Updated: December 24, 2025 • 2:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి : సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. (CM Chandrababu) కళాకారుల ద్వారా అన్నమయ్య కీర్తలను ప్రజలకు చేరువు చేస్తున్న డాక్టర్ శోభారాజు కార్యక్రమాలకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. అన్నమయ్య అంతర్జాతీయ సంకీర్తన పోటీలు తందనానా 2025లో విజేతలైన ముగ్గురు గాయనీ గాయకులకు ముఖ్యమంత్రి బంగారు పతకాలను(Gold medals) బహుకరించారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాకులో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సబ్ జూనియర్ విభాగంలో భట్టిప్రోలు మేమన, జూనియర్ విభాగంలో చిర్పల్లి శ్రీమహాలక్షి , సీనియర్ విభాగంలో సముద్రాల లక్షీ ్మ హరిచందన సీఎం చేతుల మీదుగా బంగారు పతకాలను అందుకున్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లా డుతూ…..”సంగీతం, సాహిత్యం, సంస్కృతులే విలువలు నేర్పే సాధనాలు…భారతీయ మూలాలు.

Read also: AP: కొత్తగా మరో 70 అన్న క్యాంటీన్లు

ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్స్ ప్రాంతంలో అన్నమయ్యపురం ఏర్పాటు

భారతీయ సంగీతంతో భక్తి ఉద్యమానికి ప్రాణం పోసిన మహానుభావుడు తాళ్లపాక అన్నమాచార్యులు. 32 వేల సంకీర్తనలు రచించారు. (CM Chandrababu) సామాన్యులకు అర్థమయ్యే భాషలో అన్నమయ్య కీర్తనలు ఉంటాయి. అన్నమాచార్య కీర్తనలకు ప్రాచుర్యం కల్పించే ఉద్దేశ్యంతో ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్స్ ప్రాంతంలో అన్నమయ్యపురం ఏర్పాటు చేశాం. అన్నమయ్య సంకీర్తనలను విశ్వవ్యాప్తం చేసేందుకు గత 42 ఏళ్లుగా కృషి చేస్తున్న అన్నమాచార్య భావన వాహిని సంస్థను అభినందిస్తున్నా. తందనాన పేరుతో అన్నమా చార్య అంతర్జాతీయ సంకీర్తనా పోటీలను శోభారాజు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. భావితరాలకు అన్నమయ్య సంకీర్తనల మాధుర్యాన్ని అందించి… యువ కళాకారులను అత్యున్నత స్థాయిలో ప్రోత్సహిస్తున్నారు. 12 దేశాల్లో 700పైగా కచేరీలు నిర్వహించారు. అన్నమయ్య కీర్తనలను సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే భాషలో చెప్పారు. శోభారాజు అన్న మయ్య కీర్తనలకు ఒక బ్రాండ్గా నిలుస్తున్నారు. త్వరలోనే హైదరాబాద్లోని అన్నమయ్యపురంను సందర్శిస్తాను”అని ముఖ్యమంత్రి చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Annamacharya Annamayya Keerthanalu Bhakti Sangeetam Indian Culture International Keerthana Competition Latest News in Telugu literature Music Promotion Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.