📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: CM Chandrababu – రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి

Author Icon By Anusha
Updated: September 13, 2025 • 9:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిరక్షణపై ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu) స్పష్టం చేశారు. ఏ విధమైన రాజీకి తావు లేకుండా, రాష్ట్రంలో ప్రజల భద్రత, సామాజిక సౌభ్రాత్యాన్ని కాపాడే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి అన్నారు, శాంతి పరిస్థితులు పటిష్టంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు చేరతాయి. పెట్టుబడులు పెరిగినపుడు యువతకు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి, ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. దీని ఫలితంగా రాష్ట్ర వృద్ధి రేటు కూడా ద్రుతంగా పెరుగుతుంది.

జిల్లాల ఎస్పీలతో బదిలీల అనంతరం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని కఠినంగా హెచ్చరించారు.ప్రస్తుత సమాజంలో నేరాల స్వరూపం మారిందని, రాజకీయాలను అడ్డుపెట్టుకుని నేరాలు చేసే సంస్కృతి పెరిగిపోయిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. “గతంలో రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం నేరస్థులను వాడుకునేవారు. కానీ ఇప్పుడు నేరస్థులే రాజకీయ ముసుగు వేసుకుంటున్నారు. దీనికి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసే అతిపెద్ద ఉదాహరణ.

రెండు రోజుల పాటు దాచిపెట్టారు

ఆ హత్యను మొదట గుండెపోటుగా చిత్రీకరించారు, ఆ తర్వాత నాపై నెట్టే ప్రయత్నం చేశారు. సీబీఐ (CBI) విచారణ కావాలని అడిగి, ఆ తర్వాత వద్దన్నారు. ఒకే కేసులో ఇన్ని మలుపులు దేశంలో మరెక్కడా చూసి ఉండరు. ఇది ప్రతి పోలీసు అధికారి (police officer) అధ్యయనం చేయాల్సిన కేస్ స్టడీ,” అని చంద్రబాబు వివరించారు.అలాగే, ఇటీవల జరిగిన సింగయ్య మృతి ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. “సొంత పార్టీ కార్యకర్త తమ కారు కింద పడి చనిపోతే, ఆ విషయాన్ని రెండు రోజుల పాటు దాచిపెట్టారు. వీడియోలు బయటకు రాకపోతే ఆ నిజం తెలిసేదే కాదు. పైగా, బాధిత కుటుంబంతోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించారు.

CM Chandrababu

ఇలాంటి క్రిమినల్ రాజకీయాలు నడుస్తున్న రోజుల్లో మనం ఉన్నామన్నది అధికారులు గుర్తించాలి,” అని సీఎం అన్నారు.తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజం వంటి సమస్యలను ఉక్కుపాదంతో అణచివేశానని చంద్రబాబు గుర్తుచేశారు. “రాయలసీమ (Rayalaseema) లో ఫ్యాక్షన్‌ను రూపుమాపడానికి మా పార్టీ ప్రజాప్రతినిధులను సైతం అరెస్టు చేయించాను. అంత కఠినంగా వ్యవహరించడం వల్లే అది సాధ్యమైంది. బెజవాడలో రౌడీయిజాన్ని సమర్థులైన అధికారులతో అరికట్టాం. నాడు హైదరాబాద్‌లో శాంతిభద్రతలను కాపాడటం వల్లే నేడు అదొక బ్రాండ్‌గా నిలిచింది,” అని తెలిపారు.

నక్సలిజంపై కఠినంగా వ్యవహరించినందుకే తనపై అలిపిరిలో

నక్సలిజం (Naxalism) పై కఠినంగా వ్యవహరించినందుకే తనపై అలిపిరిలో దాడి జరిగిందని, అయినా తాను వెనక్కి తగ్గలేదని సీఎం అన్నారు.మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థ కూడా అప్‌డేట్ కావాలని చంద్రబాబు సూచించారు. “దర్యాప్తులో టెక్నాలజీని 100 శాతం ఉపయోగించుకోవాలి. టెక్నాలజీ (Technology) తోనే ఉత్తమ ఫలితాలు వస్తాయి. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే, ఆ నెపాన్ని ప్రభుత్వానికి అంటగట్టేవారు. టెక్నాలజీ సాయంతోనే వాస్తవాలు నిరూపించగలిగాం,” అని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న సైకోలను, మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే వారిని కఠినంగా అణచివేయాలని ఆదేశించారు.

Read hindi news: epaper.vaartha.com

Read Also:

https://vaartha.com/tdp-mla-sravan-kumar-slams-sajjala-comments/andhra-pradesh/546734/

Andhra Pradesh Breaking News Chief Minister Nara Chandrababu Naidu Investment Opportunities latest news Law and order no compromise on security Telugu News youth employment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.