📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

CM Chandrababu: అందరికీ ఆరోగ్యం అదే సంజీవని లక్ష్యం

Author Icon By Pooja
Updated: January 17, 2026 • 12:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏడాదిలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
సిఎం చంద్రబాబు

చంద్రగిరి : అందరికీ ఆరోగ్యం అదే సంజీవని లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.. సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, శేషాపురం పంచాయతీ, నారావారిపల్లెకు ముఖ్యమంత్రి(CM Chandrababu) కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి నాలుగు రోజులు సొంతూరు పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాలను ముగించుకున్న ముఖ్యమంత్రి గురువారం తమ నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పదిరక్షణ లక్ష్యంగా, ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారు చేయనున్నట్లు తెలిపారు. కుప్పంలో సంజీవని పథకం విజయవంతం అయ్యింద న్నారు.

Read Also: Minister Lokesh: మంగళగిరిలో హజరత్ అలి పీర్ల పంజా, మదర్శాను సందర్శించిన మంత్రి

ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో అమలవు తున్న ఈ పధకాన్ని ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిపారు, హెల్త్, వెల్త్, హ్యాపీ సొసైటీ నిర్మించాలని అన్నారు. ఇందుకు దోహదపడే ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో భాగం గా చెత్తను సేకరించి పోగుచేస్తున్నట్లు తెలిపారు.


సేకరించిన చెత్తలో తడి చెత్త నుండి ఎరువులు, పొడి చెత్త వ్యర్థాలను వనరులుగా మార్చి నీవా నుండి కల్యాణి డ్యామ్ నీటి తరలింపు (సేకరించడం, తయారు చేయడం, పాఠ వేయడం) ఆర్ధిక వ్యవస్థలోకి ప్రవేశ పెట్టడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం జరుగు తుందన్నారు. గత ప్రభుత్వం భూ సమస్యలను సృష్టించడంతో పాటు ఇష్టం లేని వారి భూములను 22ఏలో పెట్టారని అన్నారు. భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకుండా 2027 నాటికి శాశ్వత పరిష్కారం చేస్తామ న్నారు. ఇందు కోసం జాయింట్ కలెక్టర్లు ఏడాది పొడవునా రెవెన్యూ సమస్యలపై పనిచేస్తారని అన్నారు(CM Chandrababu). ఏడాది కాలాన్ని లక్ష్యంగా చేసుకుని పూర్తి స్థాయిలో భూములను సర్వే చేయించి క్యూఆర్ రోడ్తో పాస్ట్బుక్లు ఇస్తామన్నారు. సాంకేతికత, ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పటికీ సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గలేదన్నారు. ఇందుకు 24 మార్గదర్శి, బంగారు కుటుంబాలు వ్యవస్థ ద్వారా పేదరికాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా 10 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు.

ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితేనే అభివృద్ధి చెందినట్లు అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కొరకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కళ్యాణీ డ్యామ్కు నీటిని తరలించే ప్రక్రియలో చిత్తూరుకు నీటిని తరలిస్తున్న నీవా నుండి రూ.126 కోట్లతో పైప్ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు వెళ్ళడించారు. ముందుగా మూలపల్లి చెరువుతో పాటు మరో నాలుగు చెరువులను నింపుతూ కళ్యాణీ డ్యామ్కు నీటిని తరలించనున్నట్లు తెలిపారు. తద్వారా ఈ ప్రాంతంలో భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతాయనీ, రైతులు ఆర్థికంగా బలోపేతం కాగలదన్నారు. ధాన్యం రైతులకు రూ.10 వేల కోట్లు చెల్లించి వారిలో సంతోషాలను నింపామని అన్నారు.

కేంద్రం ప్రకటించిన 2047 వికసిత్ భారత్ అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించుకుని 2029, 2039కి లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగిందన్నారు. గత ఏడాది స్వర్ణ నారావారిపల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామనీ ఇందులో ఏ. రంగంపేట, కందులవారివల్లె, చిన్నరామాపురం 3 పంచాయతీలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల తలసరి ఆదాయం 20 శాతం పెరిగినట్లు తెలిపారు. స్వర్ణ నారావారిపల్లె కార్యక్రమంలో ప్రత్యేక అధికారిని నియమించి మరుగుదొడ్లు, దీవం కనెక్షన్లు, పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఇల్లు లేని వారిని గుర్తించామని, స్థలం వున్నప్పటికీ ఇల్లు వారు వున్నారని అన్నారు. ఈ ఏడాది అందరికీ సొంతింటి కల సాకారం చేస్తామన్నారు.

ప్రతి ఇంటికీ నీటి కొళాయి: కనెక్షన్ ఇస్తామన్నారు.

ప్రస్తుతం స్వర్ణ కుప్పం, స్వర్ణ నారావారివల్లి తరహాలో చంద్రగిరి మండలాన్ని యూనిట్ తీసుకుని స్వర్ణ చంద్రగిరి. మండలంగా అభివృద్ధి ప్రణాళికలను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత నిరుద్యోగ యువతలో స్కిల్ డెవలప్మెంట్ కొరకు నారావారిపల్లెలో ఒక సెంటర్ను ప్రారంభించామన్నారు. మేనేజ్ మెంట్ స్కిల్స్ పెంపొందించడానికి ఈ సెంటర్ దోహణ పడగలదన్నారు. ఏ. రంగంపేట హైస్కూల్, జూనియర్ కళాశాల కేంద్రంగా విద్యపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కేర్ అండ్ గ్రో కార్యక్రమం ద్వారా అంగన్వాడీ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఏళ్ళ తరబడి ఇబ్బంది పడుతున్న శెట్టిపల్లి ప్రజల భూ సమస్యలకు పరిష్కారం చూపినట్లు తెలిపారు. పర్యాటకంగా తిరుపతి, తిరుపతి రూరల్ ప్రాంతాలలో హోం స్త్రీలకు ప్రాధాన్యత కల్పించి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. తిరుపతి చెరువులకు, విజయవాడ కెనాల్స్క, విశాఖ బీచ్కు ప్రసిద్ధి అన్నారు. రానున్న రోజుల్లో తిరుపతి వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్ గా అవతరిస్తుందన్నారు. తిరుపతి, విశాఖ, అమరావతిలను మెగా సిటీలు తీర్చిదిద్దుతామన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu HealthForAll Latest News in Telugu SanjeevaniScheme

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.