📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Telugu News: CM Chandrababu: నారా భువనేశ్వరికి గోల్డెన్ పీకాక్ అవార్డు

Author Icon By Sushmitha
Updated: November 1, 2025 • 12:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రజాసేవ, సామాజిక ప్రభావంలో కృషికి గుర్తింపు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) ప్రజా సేవ, సామాజిక ప్రభావం రంగంలో చేసిన విశేష కృషికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. భారత్‌లోని ప్రముఖ సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) ఆమెను ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025’ అవార్డుకు(award) ఎంపిక చేసింది. ప్రజా సేవ, సామాజిక ప్రభావం, నాయకత్వం వంటి అంశాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు ప్రతి ఏటా ఈ అవార్డును ఐఓడీ అందజేస్తుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును గతంలో భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, గోపీచంద్ హిందూజా, రాజశ్రీ బిర్లా వంటి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు అందుకున్నారు.

Read Also: Kurnool:ఘోర రోడ్డు ప్రమాదం – మహిళ మృతి, 12 మందికి గాయాలు

ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ

నారా భువనేశ్వరి నేతృత్వంలో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్(NTR Trust) విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, విపత్తు సహాయం వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, ఎన్టీఆర్ విద్యార్థి సహాయ పథకాలు, విపత్తు నిర్వహణ సేవలు, మహిళల ఆర్థిక స్వావలంబన కార్యక్రమాలు ప్రజల మన్ననలు పొందాయి. ప్రత్యేకించి తలసేమియా రోగులకు ఉచితంగా బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్స్(Blood transfusions) నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా సీఎం సతీమణి భువనేశ్వరి ప్రజాసేవా నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు.

CM Chandrababu

కార్పొరేట్ గవర్నెన్స్‌లో గోల్డెన్ పీకాక్ అవార్డు

నారా భువనేశ్వరి మహిళా నాయకత్వానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కార్పొరేట్ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్కు వైస్ చైర్‌పర్సన్, ఎండీగా ఉన్న ఆమె ఆ సంస్థను పారదర్శకత, సామాజిక బాధ్యతతో నడిపిస్తున్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మక డెయిరీ బ్రాండ్‌గా హెరిటేజ్ సంస్థను తీర్చిదిద్దారు. ఎఫ్ఎంసీజీ రంగంలో అత్యుత్తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్‌కు దక్కిన ‘ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్’ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డును కూడా ఆమె అందుకోనున్నారు. ఈ ఐఓడీ పురస్కారాన్ని ఆమె నవంబర్ 4న లండన్‌లో జరిగే గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్‌లో స్వీకరించనున్నారు. 2013లోనే ‘ఫార్చూన్ ఇండియా’ నారా భువనేశ్వరిని దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Distinguished Fellowship Award global recognition. Google News in Telugu Heritage Foods IOD Latest News in Telugu Nara Bhuvaneswari NTR Trust Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.