ఆంధ్రప్రదేశ్(AP) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అధికారులకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. (CM Chandrababu) రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడం అత్యంత ప్రధానమైన సమస్యగా గుర్తిస్తూ, గణనీయమైన చర్యలు చేపట్టాలని సూచించారు. దీనికి అనుగుణంగా మూడు ప్రాంతాల్లో డీ-ఎడిక్షన్ సెంటర్లు (వ్యసన విముక్తి కేంద్రాలు) ఏర్పాటు చేయాలని, అందులో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సీఎం స్వయంగా ఈ కార్యక్రమాలలో పాల్గొని సమగ్ర భాగస్వామ్యాన్ని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.
సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై సమీక్షలో, డ్రగ్స్, గంజాయి వినియోగంపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న డీ-ఎడిక్షన్ సెంటర్లు ఉన్నప్పటికీ, ఎక్కువ మంది హైదరాబాద్ వెళ్ళే పరిస్థితి ఉందని, రాష్ట్రంలో సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ఈ సమస్యను తగ్గించగలమని గుర్తించారు.
Read Also: Anantapur: నూతన పోలీస్ కానిస్టేబుల్స్ కు శిక్షణ ప్రారంభించిన డి.ఐ.జి
ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి
ఇంకా, నకిలీ మద్యం నియంత్రణ కోసం, ప్రతి మద్యం సీసాకు ప్రత్యేకమైన లిక్కర్ ఐడెంటిఫికేషన్ నంబర్ (LIN) విధించాలని సూచించారు. లిన్ లో బ్రాండ్, బ్యాచ్, తయారీ తేదీ, సమయం వంటి పూర్తి వివరాలు ఉండాలి. జియో ట్యాగింగ్‌తో సరఫరా శ్రేణిని పూర్తి పారదర్శకంగా చేయడం, బెల్ట్‌షాపులపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ లక్ష్యం అని (CM Chandrababu) అన్నారు.
అదేవిధంగా, వీధీ దీపాలు, తాగునీటి సరఫరా, హాస్టల్స్‌లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తాగునీరు సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని, నిర్లక్ష్యాన్ని నివారించడానికి అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించడం, క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తిగా హాజరు కావడం కూడా ముఖ్యమని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: