ఫిడే వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ (Chess Championship) లో కాంస్య పతకాలు సాధించిన తెలుగు క్రీడాకారులు అర్జున్ ఎరిగైసి, కోనేరు హంపిలను ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. కోనేరు హంపిని ఉద్దేశించి చంద్రబాబు స్పందిస్తూ, “ఒక్క ఫలితంతో ఛాంపియన్లను అంచనా వేయలేం. అత్యున్నత స్థాయిలో పదేపదే పోటీపడే ధైర్యమే వారిని నిలబెడుతుంది.
Read Also: Karveti Nagaram temple: ముక్కోటి వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్దం
ప్రపంచ వేదికపై కాంస్యం సాధించడం మీ నైపుణ్యానికి నిదర్శనం. మీ ప్రయాణం, నిలకడ దేశంలోని లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది” అని పేర్కొన్నారు. అదేవిధంగా అర్జున్ ఎరిగైసిని కూడా ఆయన కొనియాడారు. “పురుషుల్లో గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక భారత క్రీడాకారుడిగా అర్జున్ నిలిచారు. తెలంగాణ బిడ్డ అయిన అర్జున్, భారత చెస్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేర్చారు” అని చంద్రబాబు అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: