📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Latest News: CM Chandrababu: ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులకు సీఎం కీలక సూచనలు

Author Icon By Aanusha
Updated: December 9, 2025 • 8:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సోమవారం ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ)పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పారదర్శక పాలన అందించడంతో పాటు, ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Read Also: Global Summit 2025: పెట్టుబడులకు హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్: మాజీ ఎంపీ

ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే అవసరం లేకుండా అన్ని సేవలను అందించాలని సీఎం నిర్దేశించారు.ఇందుకు ‘మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్’ను సమర్థంగా వినియోగించుకోవాలని, దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికీ కొన్ని శాఖలు భౌతికంగానే సేవలు అందిస్తున్నాయని, అవి వెంటనే తమ పద్ధతి మార్చుకుని ఆన్‌లైన్‌ బాట పట్టాలని చంద్రబాబు (CM Chandrababu) అన్నారు.

CM Chandrababu: CM’s key instructions to officials in RTGS review

పలు కీలక సూచనలు చేశారు

పలు శాఖలకు ముఖ్యమంత్రి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ల అనంతరం డాక్యుమెంట్లను కొరియర్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే పంపాలని సూచించారు.ఆర్టీసీ బస్టాండ్లలో, ముఖ్యంగా టాయిలెట్ల వద్ద పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. భవిష్యత్తులో డ్రోన్ల వినియోగం గణనీయంగా పెరుగుతుందని, వాటి సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని చెప్పారు.

పురుగు మందుల వాడకాన్ని తగ్గించేందుకు డ్రోన్లను ఎలా ఉపయోగించవచ్చో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కొన్ని జిల్లాల్లో అధికారులు అమలు చేస్తున్న మంచి విధానాలను గుర్తించి, వాటిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh government services AP online services Chandrababu Naidu orders digital governance AP latest news RTGS review meeting Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.