📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Telugu News: CM Chandrababu: అమరావతి పనుల పై సీఎం సమీక్ష

Author Icon By Sushmitha
Updated: October 31, 2025 • 5:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజధాని అమరావతి(Amaravati) నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకూడదని, నిర్దేశించుకున్న గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) అధికారులను ఆదేశించారు. నిర్మాణాల్లో వేగంతో పాటు నాణ్యత విషయంలో కచ్చితమైన ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ (CRDA), ఏడీసీఎల్, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిని ప్రతి 15 రోజులకు ఒకసారి తానే స్వయంగా సమీక్షిస్తానని చంద్రబాబు వెల్లడించారు.

Read Also: Bangladesh: నేనెందుకు బంగ్లాదేశ్ ను వదలివచ్చానంటే.. షేక్ హసీనా

CM Chandrababu

పనుల వేగం, నిర్మాణ సంస్థలపై చర్యలు

రాజీధానిలో చేపట్టిన భవన నిర్మాణాల పురోగతి, సుందరీకరణ పనులు, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై సీఎం చర్చించారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల పనుల్లో కొంత జాప్యం జరిగినా, రానున్న రోజుల్లో దానిని భర్తీ చేసేలా వేగం పెంచాలని సూచించారు. కొన్ని నిర్మాణ సంస్థలు ఇంకా పూర్తిస్థాయిలో వర్క్ ఫోర్స్, మెషినరీని కేటాయించలేదని, అలాంటి సంస్థలు తమ పనితీరును వెంటనే మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. భవన నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా గనుల శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

రైతుల సమస్యలు, ప్లాట్ల రిజిస్ట్రేషన్

రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి నారాయణ, అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఇంకా 2,471 మంది రైతులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని, కొన్ని సాంకేతిక, రైతుల(Farmers) వ్యక్తిగత కారణాల వల్ల ఇవి పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. త్వరలోనే తాను రాజధాని రైతులతో సమావేశమవుతానని చంద్రబాబు తెలిపారు. అమరావతికి ‘వరల్డ్ క్లాస్ సిటీ’ లుక్ రావాలంటే ఆకాశహర్మ్యాలు (High-rise buildings) అవసరమని అభిప్రాయపడ్డారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Amaravati capital construction Chandrababu Naidu CRDA farmer issues Google News in Telugu infrastructure development Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.