📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

CM Chandrababu: కేంద్ర క్రీడాశాఖ మంత్రిని కలిసిన సీఎం చంద్రబాబు

Author Icon By Anusha
Updated: July 16, 2025 • 4:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రెండో రోజు బుధవారం కొనసాగింది. ఇందులో భాగంగా ఆయన కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ఖేలో ఇండియా, జలక్రీడలు, స్టేడియంల అభివృద్ధి, బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాంటి కీలక అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్రానికి వివరణాత్మక ప్రతిపాదనలు సమర్పించారు.చంద్రబాబు (CM Chandrababu) మంత్రి మాండవీయతో మాట్లాడుతూ, అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రంను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కృష్ణా నది తీరాన్ని ఉపయోగించి, జాతీయ జలక్రీడల శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని వివరించారు. Amaravati to become National Water Sports Training Hub అన్న దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు.

ఖేలో ఇండియా

నాగార్జునా యూనివర్సిటీ, కాకినాడలో National Centres of Excellence స్థాపనపై చంద్రబాబు ప్రతిపాదనలు ఇచ్చారు. తిరుపతి, రాజమహేంద్రవరం, నరసరావుపేట తదితర నగరాల్లో ఖేలో ఇండియా కింద స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలని కోరారు. ఖేలో ఇండియా కింద (District-level Talent Identification Centers) కోసం అదనపు కేంద్రాలను మంజూరు చేయాలని చెప్పారు.విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి రూ. 27 కోట్లు, గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రూ. 170 కోట్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి రూ. 341 కోట్లు మంజూరు చేయాలని చంద్రబాబు కేంద్రమంత్రిని కోరారు. జిల్లాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు అదనంగా ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయాలని కోరారు.

కేంద్రమంత్రిని

రాయలసీమలోని తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని ,2024-29 స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఏపీలో స్పోర్ట్స్ ఎకో సిస్టం అభివృద్దికి చర్యలు చేపట్టినట్టు కేంద్రమంత్రికి చంద్రబాబు వివరించారు.ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ను ఏపీలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వడంపై కేంద్ర మంత్రి మాండవీయకు ధన్యవాదాలు తెలిపారు విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో అత్యుత్తమ క్రీడా వేదికలపై వీటిని నిర్వహిస్తామని చంద్రబాబు కేంద్రమంత్రికి తెలిపారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ (Martial Arts Games) నిర్వహణకు రూ.25 కోట్లు విడుదల చేయాలని కేంద్రమంత్రిని చంద్రబాబు కోరారు. చంద్రబాబు వినతి పట్ల కేంద్రమంత్రి సైతం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

చంద్రబాబు నాయుడు ఎవరు? ఆయన చరిత్ర ఏమిటి?

ఎన్. చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయన తెలుగు దేశం పార్టీ (TDP)కి చెందినవారు. 1989 నుంచి 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా (MLA) వ్యవహరించారు.

ఎన్టీఆర్‌కు చంద్రబాబు నాయుడుకు సంబంధమేంటి?

తెలుగు సినిమా దిగ్గజం, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి మూడో కుమార్తె నారా భువనేశ్వరి గారిని నారా చంద్రబాబు నాయుడు గారు వివాహం చేసుకున్నారు. దీంతో చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారి అల్లుడు అవుతారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Warning : చంద్రబాబు కు జగన్ వార్నింగ్

Breaking News Chandrababu Delhi Visit Khelo India 2025 latest news Mansukh Mandaviya Meeting Sports Infrastructure Andhra Pradesh Water Sports Amaravati

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.