📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

CM Chandrababu: మహిళల జోలికొస్తే ఖబడ్డార్.. నేరగాళ్లపై డ్రోన్ నిఘా!

Author Icon By Pooja
Updated: March 14, 2026 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

CM Chandrababu : రాష్ట్రంలో మహిళలపై నేరాలు జరుగకుండా మరింత మెరుగైన రీతిలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించా రు. క్రైమ్ ఎగినేష్ట్ విమెన్ విషయంలో నిరం తరం అప్రమత్తంగా ఉండాలని పోలీసు యంత్రాంగానికి సూచించారు. స్త్రీలపై నేరాలకు పాల్పడే వారిని అత్యంత కఠినంగా అణచివేస్తా మని పునరుద్ఘాటించారు. రౌడీషీటర్లను కట్టడి చేయడానికి డ్రోన్లతో నిఘా పెట్టే అంశాన్ని పరిశీలించాలన్నారు. గత పాలనలో గంజాయి, అక్రమ మద్యం లాంటివి విచ్చలవిడిగా ఉండేవని, వదంతులు సృష్టించటం, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననం లాంటివి గతంలో ఉన్నాయని గుర్తు చేశారు. నెల్లూరులో రౌడీ ముఠాలను గుర్తించారన్న ఆయన ఇలాంటి ముఠాలు మిగిలిన జిల్లాల్లో ఉన్నాయేమో నిఘా పెట్టాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి గ్యాంగులను కట్టడి చేయంతో పాటు డీఆడిక్షన్ కేంద్రాల ద్వారా మార్పు తీసుకురావాలని హితవు పలికారు.

Read Also :Telangana GST Scam: తెలంగాణలో రూ. 84. 15 కోట్ల జీఎస్టీ స్కామ్?.. నిందితుడు అరెస్ట్!

CM Chandrababu: Beware—touch women at your own peril! Drone surveillance on criminals.

నేరాలు జరిగినప్పుడు పోలీసులు కఠినంగా ఉంటే నిందితులకు భయం వస్తుందని తేల్చిచెప్పారు. గంజాయి, డ్రగ్స్ చాలా వరకు నియంత్రించట్టాన్ని ప్రశంసించిన సీఎం, నిర్మూలన దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని, నిబంధనల అమలులో కఠినంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా పటిష్ట కార్యాచరణ చేపట్టాలని, ప్రతీ ప్రాణమూ విలువైనదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రమాదాల నివారణకు పోలీసు, రవాణాశాఖ శాంతిభద్రతల సమీక్షలో అధికారులకు సిఎం చంద్రబాబు ఆదేశం ప్రత్యేక చర్యలు తీసుకోని సమన్వయంతో పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై సిఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ అంశాలను సిఎంఓ మీడియాకు విడుదల చేసింది. సైబర్ క్రైమ్, మనీ ఫ్రాడ్, డిజిటల్ అరెస్టులపై ప్రజలను అప్రమత్తం చేసేలా విశాఖ పోలీసులు రూపొందించిన ప్రచార వీడియోలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్రంలో నేరాల రేటు 6 శాతం మేర తగ్గి, శాంతిభద్రతలు నియంత్రణలో ఉన్నాయని సీఎం అన్నారు.

ఆర్థిక నేరాలు, సైబర్ ఫ్రాడ్స్ పెరిగాయని, వీటిని కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతిభద్రతలు సరిగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని స్పష్టం చేశారు. రోడ్ సేఫ్టీ చర్యలు పకడ్బంధీగా అమలు చేయాలని అన్నారు. అవసరమైన చోట ట్రామా సెంటర్లను ఏర్పాటు చేయాలని, 503 బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాలు సరి చేయాలనీ ఆదేశించారు. రాష్ట్రంలో పోలీస్ ఫోర్స్ రేషనలైజేషన్ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అవసరమైన చోట పోలీస్ సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసారు. కొత్త జిల్లాలు, సున్నితమైన ప్రాంతాలు, సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే దేవాలయాల వద్ద అవసరమైన మేరకు పోలీసు సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని సూచించారు.

ఏపీలో రోడ్డు ప్రమాదాల నివారణకు ₹44 కోట్లు.. బ్లాక్ స్పాట్లపై సీఎం ఫోకస్.

శ్రీకాకుళం లాంటి కొన్ని జిల్లాల్లో చేపడుతున్న ఉత్తమ విధానాలను ఇతర ప్రాంతాల్లోనూ అనుసరించాలన్నారు. డ్రంక్ అంద్ డ్రైవ్ విషయంలో కఠినంగానే వ్యవహరించాలని ఎవరైనా సరే ఉపేక్షించవద్దని తేల్చిచెప్పారు. బ్రీత్ అనలైజర్లు, స్పీడ్ గన్లు కొనుగోలుకు 44 కోట్లు విడుదల చేస్తామన్నారు. జాతీయ సగటుతో పోలిస్తే రోడ్డు ప్రమాదాల విషయంలో ఏపీ మరింత మెరుగు పడాలన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్ లాంటి అంశాల నియంత్రణకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. అనకాపల్లి, పశ్చిమ గోదావరి, విశాఖ, తదితర జిల్లాల్లోని బ్లాక్ స్పాట్లపై దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు ప్రతీ బ్లాక్ స్పాట్లను తనిఖీ చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళలపై జరుగుతున్న నేరాల్లో నిందితులకు భయం ఉండేలా కఠినంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహిళపై నేరాల్లో జీరో టాలరెన్సు ఉంటేనే మార్పు సాధ్యమని అన్నారు. మదనపల్లి తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీలు కఠినంగా ఉండాలన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

#AndhraPradesh #APPolice #ChandrababuNaidu #RoadSafety #WomenSafety

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.