రైతులకు ఉపయోగపడేలా ఏపీ (AP) ప్రభుత్వం త్వరలో మరో కొత్త కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనుంది. (CM Chandrababu) ఆర్గానిక్ వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు త్వరలో కొత్త కార్యక్రమం చేపట్టనుంది. ఈ మేరకు అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు జారీ చేశారు. తాజాగా సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్‌పై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Andhra Pradesh: రాష్ట్రాల అవసరాల మేరకు యూరియా సరఫరా
రైతులకు సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సాదుపాయం
తొలుత రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకొచ్చిన 18 లక్షల మంది రైతులకు సహకారం అందించనున్నారు. (CM Chandrababu) రైతులు పండించే ఆర్గానిక్ ఉత్పత్తుల నాణ్యత అందరికీ తెలిసేలా సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సాదుపాయం ప్రభుత్వమే అందించనుంది. వచ్చే ఏప్రిల్ నాటికి ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇక రైతులకు ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేయాలి..? ఎలా రాబడి పొందాలి? అనే దానిపై ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. అంతర్జాతీయ స్థాయిలో ఏపీ వ్యవసాయ ఉత్పత్తుల వాటా పెరిగేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు.
ఆక్వా సాగు చేసేవారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అటు పాల్ట్రీ రంగంలో ఉన్న రైతులకు ప్రభుత్వం సహాయం అందించనుంది. అందులో భాగంగా అంగన్వాడీలకు అవసరమైన గుడ్లను పాల్ట్రీ రైతులు సరఫరా చేసేలా కాంట్రాక్ట్‌లు ఇవ్వనున్నారు. ఇక ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: