📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

CM Chandrababu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

Author Icon By Saritha
Updated: March 10, 2026 • 5:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ను ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా నిర్దేశించారు. మంగళవారం సచివాలయంలో గనుల శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రప్రదేశ్ టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్ ఏర్పాటు, పెట్టుబడుల ఆకర్షణ వంటి కీలక అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఇందుకు రాష్ట్ర తీరప్రాంతంలో లభించే విలువైన బీచ్ సాండ్ వంటి ఖనిజ సంపదను సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.

వీటిలో ప్రధానంగా ఇల్మెనైట్, రుటైల్, జిర్కాన్, మోనాజైట్, గార్నెట్, సిల్లిమనైట్ వంటి వ్యూహాత్మక ప్రాధాన్యమున్న ఖనిజాలు ఉన్నట్లు తెలిపారు. ఈ బీచ్ సాండ్ మినరల్స్ నుంచి వచ్చే ఉత్పత్తులు పెయింట్స్, కాస్మెటిక్స్, ఫార్మా రంగాలతో పాటు ఏరోస్పేస్, రక్షణ, శస్త్రచికిత్స పరికరాలు, సెరామిక్స్, ఎలక్ట్రానిక్స్, అణు ఇంధనం, అణు రియాక్టర్ల విడిభాగాల తయారీ వంటి అత్యంత కీలకమైన పరిశ్రమలకు అవసరమని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

Read Also: Kadiri Rathotsavam Accident:కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

CM Chandrababu: AP state as an ‘Integrated Strategic Material Hub’

మూడు భారీ ప్రాసెసింగ్ పార్కుల ప్రతిపాదన

ఈ మిషన్ ద్వారా రాబోయే పదేళ్లలో రూ.50,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు, 40,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం వనరులను వెలికితీయడమే కాకుండా, వాటికి విలువ జోడించడం పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఈ ఖనిజ సంపదను సమర్థంగా వినియోగించుకునేందుకు రాష్ట్రంలో మూడు ముఖ్యమైన ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. శ్రీకాకుళంలో టైటానియం పార్క్, అనకాపల్లిలో రేర్ ఎర్త్ కారిడార్, మచిలీపట్నంలో సమగ్ర టైటానియం, రేర్ ఎర్త్ కారిడార్‌లను ఏర్పాటు చేయాలని తమ ప్రతిపాదనలను సీఎం ముందుంచారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh APTSMM Beach Sand Mining Chandrababu Naidu Titanium Hub

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.