ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం, ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలు ఈ సమావేశంలో ప్రస్తావనకు రానున్నాయి.
Read Also: APSRTC recruitment 2026: 7,673 ఉద్యోగాల భర్తీకి కసరత్తు
అటవీ విస్తీర్ణం విస్తరణపై అధికారులకు దిశానిర్దేశం
అధికార వర్గాల సమాచారం ప్రకారం, సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఉదయం 10.15 గంటలకు సచివాలయానికి చేరుకుని అనంతరం కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత పర్యావరణ శాఖ అధికారులతో సీఎం ప్రత్యేకంగా భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గ్రీన్ కవర్ అంశంపై సమీక్ష నిర్వహించి, పచ్చదనం పెంపుదల, అటవీ విస్తీర్ణం విస్తరణపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు.
అనంతరం సాయంత్రం 4 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న, నూతనంగా చేపట్టిన రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాగుతున్న రైల్వే పనులను వేగవంతం చేయాలని అధికారులకు కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. రోజంతా వరుస సమీక్షలు, అధికారిక సమావేశాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 6.45 గంటలకు సీఎం తన నివాసానికి తిరిగి చేరుకోనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: