📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: CM Chandrababu : వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు

Author Icon By Anusha
Updated: September 23, 2025 • 11:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖ : పాలనలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ అత్యంత ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. సాంకేతికతతోనే ప్రజలకు పాలను మరింత చేరువ చేసే అవకాశం ఉంటుందని సీఎం (CM Chandrababu) స్పష్టం చేశారు. కేంద్ర ఐటీ సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ ఈ గవర్నెన్సు సభకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సివిల్ సర్సీసెస్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ థీమ్ తో జరుగుతున్న 28వ జాతీయ ఈగవర్నెన్సు సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

ప్రభుత్వ శాఖల ద్వారా అందే పౌర సేవలను మరింత సమర్ధంగా నిర్వహించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ (Artificial Intelligence, Cyber ​​Security) లాంటి సాంకేతికత కీలకమని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఐటీ, ఈ గవర్నెన్స్ అంశాలతో పాలనలో మార్పులు వచ్చాయని ముఖ్యమంత్రి అన్నారు. కమ్యూనికేషన్ సంస్కరణల ద్వారా ప్రజా జీవనంలోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని స్పష్టం చేశారు.

ఈ వ్యవస్థలను అమలు చేసే సమయంలో

సాంకేతికతను అందిపుచ్చుకుని గతంలోనే ఉమ్మడి ఏపీలో ఈ సేవ, మీసేవ ద్వారా ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లామని సీఎం అన్నారు. ఈఫైల్స్, ఈకేబినెట్ లాంటి అంశాలతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఏర్పడిందని అన్నారు. అలాగే ఈ వ్యవస్థలను అమలు చేసే సమయంలో సైబర్ సెక్యూరిటీ (Cyber ​​Security) కూడా అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఐటీతో వచ్చిన విసృత ప్రయోజనాలను అందిపుచ్చు కోగలుగుతున్నామని అన్నారు.

ఈ ప్రక్రియను మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు మనమిత్ర వాట్సవ్ గవర్నెన్సు (WhatsApp Governance) ను అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. మొత్తం 751 పౌరసేవల్ని వాట్సప్ ద్వారా పౌరులకు అందిస్తూ పాలనను వారి మొబైల్ ఫోన్ల వరకూ తీసుకెళ్లామని స్పష్టం చేశారు. మరోవైపు సాంకేతికత కారణంగా పొరుగు రాష్ట్రాలతోనూ పోటీ పెరిగిందని సీఎం అన్నారు. సంజీవని ప్రాజెక్టు దేశవ్యాప్తంగా అమలుకు అవకాశంఆంధ్రప్రదేశ్ లో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలతో కలిసి క్వాంటం వ్యాలీ ని ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు.

CM Chandrababu

స్వదేశీ ఉత్పత్తుల నినాదాన్ని స్వాగతిస్తున్నట్టు

క్వాంటం కంప్యూటర్ సేవలను ప్రభుత్వాలు,విద్య, వైద్య సంస్థలు వినియోగించుకునే అవకాశం ఉందని సీఎం సూచించారు. క్వాంటం వ్యాలీ (Quantum Valley) తో ఇక్కడ ఓ ఎకో సిస్టం ఏర్పాటు ఆవుతోందని సీఎం తెలిపారు. క్వాంటం కంప్యూటర్లు, పరికరాల తయారీ సంస్థలు కూడా పెట్టుబడులతో ముందుకు వచ్చాయని ముఖ్యమంత్రి వివరించారు. టెక్నాలజీ పరంగా సేవలు, ఉద్యోగాలు, ఉత్పాదన తదితర రంగాలు కూడా వేగంగా మారుతున్నాయని,

ఈ పరిస్థితుల మధ్య వచ్చే 10 ఏళ్ల కాలం మన దేశానికి అత్యంత కీలకమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రధాని మోదీ (Prime Minister Modi) ఇచ్చిన స్వదేశీ ఉత్పత్తుల నినాదాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపిన ముఖ్యమంత్రి.. దానికి అనుగుణంగా దేశంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్స్ గా మారాలన్నారు. ఏపీలో వైద్య సేవలను టెక్నాలజీతో అనుసంధానం చేసే సంజీవని ప్రాజెక్టు చేపట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

బిల్ గేట్స్ ఫౌండేషన్ తో కలిసి డిజిటల్ హెల్త్ రికార్డులను రూపొందిస్తున్నామని త్వరలో ఈ వ్యవస్థను మొత్తం దేశానికీ అమలు చేసేందుకు అస్కారం ఉందని అన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు ఏమేరకు ఈజ్ ఆఫ్ లివింగ్ ను చేరువ చేశామన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/tirumala-vice-president-radhakrishnan-cm-chandrababu-to-visit-tirumala-tomorrow/national/552495/

Administration Andhra Pradesh Breaking News Chief Minister CM Chandrababu naidu Digital Transformation Governance innovation latest news Technology Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.