📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Telugu News: CM Chadrababu: ఎపి లింక్ను ఆర్థికంగా బలోపేతం చేయండి

Author Icon By Tejaswini Y
Updated: November 27, 2025 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇన్ఫ్రాస్టక్చర్ ఇతర ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ కార్పోరేషన్ ఏపీ లింక్ సంస్థను ఆర్థికంగా బలో పేతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chadrababu) ఆదేశించారు. రాష్ట్రంలోని రహదారులను గుంతలు లేకుండా తీర్చి దిద్దడమే ప్రభుత్వానికి అ త్యంత ప్రాధాన్యతా అంశమని సీఎం స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆర్ అండ్ బి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… “ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయబోతున్న ఏపీలింక్(AP Link) సంస్థ ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఇప్పటి నుంచే దీనిపై ప్రణాళికలు రూపోందించాలి.

Read Also: AP: మాజీ ఎంపీ రఘురామ టార్చర్.. కేసులోఐపిఎస్ సునీల్ కుమార్ కు నోటీసులు

CM Chadrababu: Strengthen AP Link financially

లాజిస్టిక్స్ కార్పోరేషన్ ను బలోపేతం చేసే క్రమంలో రహదారులు భవనాల శాఖకు వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయాలను ఎంత వినియోగించుకోవచ్చో లాజిస్టిక్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే సంస్థ ఆర్థికంగా బలోపేతం చేయడానికి మార్గం సుగమం అవుతుంది. అప్పుడు వరకు చూడాలి. నిర్మాణంలో, నిర్వహణ లో రాష్ట్రంలోని రహదారుల నెట్ వర్క్ తో పాటు మోలిక సదుపాయాలను అద్భుతంగా తీర్చిదిద్దవచ్చు. “అని సీఎం చెప్పారు. రోడ్ల నాణ్యత… ఇంజ నీర్లకు జవాబు దారీ తనం “రోడ్ల నిర్మా ణం, నిర్వ హణ, పాత్స్ హోల్స్ ఫ్రీ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రాష్ట్రంలో గుంతల రోడ్లు కన్పించకూడదు.

CM Chadrababu: రోడ్ల హణలో నాణ్యత ప్రమాణాలు తప్పకుండా చూసుకోవాలి. అలాగే కాంట్రాక్టర్లు ఏదైనా తప్పు చేసినా… నాణ్యతలో రాజీ పడినా అలాంటి కాంట్రాక్టర్లను గుర్తించాలి. ఇక ఇంజనీర్లు కూడా జవాబు దారీ తనంతో పని చేయాలి. ఈ ఏడాది మార్చిలో ఆమోదించిన రోడ్ల నిర్వహణ, పాత్ హోల్స్ పనులు 10 నుంచి 15 శాతం మేర పనులు పూర్తయ్యాయి. అలాగే ఇటీవలే ఆమోదించిన పనులు వచ్చే నెల నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకోండి. ఇప్పటి వరకు ఆమోదాలు పొందిన పనులు వచ్చే ఏడాది నాటికి వరసత పూర్తయ్యేలా చూడాలి. అలాగే రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాలి.

మొంథా తుఫానులో నష్టపోయిన రోడ్లు

దీని కోసం డ్రోన్లు, లైడార్ సర్వే అవసరమైతే శాటిలైట్ సర్వేల ద్వారా రోడ్ల పరిస్థితి ఎలా ఉందన్న అంశాలను పరిశీలించటంతో పాటు పనులు ఏ విధంగా జరుగుతున్నాయోననే విషయాన్ని గుర్తించాలి. దీని కోసం టెక్నాలజీ(Technology)ని వినియోగించుకోవాలి. మొంథా తుఫానులో నష్టపోయిన రోడ్లు, బ్రిడ్జిల పునర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. ఇప్పటికే కొన్నింటిని చక్కదిద్దాం… పెండింగులో ఉన్న పనులను కూడా వెంటనే చేపట్టాలి. పీపీపీ విధానంలో చేపట్టనున్న రోడ్ల జాబితా వెంటనే సిద్ధం చేయాలి. నిబంధనల ప్రకారం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ఏయే రోడ్లకు ఇవ్వగలమనేది పరిశీలించాలి. వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణంపై పైలెట్ ప్రాజెక్టులు చేపట్టాలి.” అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

నేషనల్ హైవేల పనుల్లో జాప్యం జరగకూడదు రాష్ట్ర రోడ్లతో పాటు… నేషనల్ హైవేల విషయంలోనూ అధికారులు దృష్టి పెట్టాలి. నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి. భూసేకరణ మొదలుకుని ఇతర అంశాల్లో కేంద్రానికి పూర్తిగా సహకరించాలి. ఏ మాత్రం జాప్యం జరగడానికి వీల్లేదు. అలాగే స్టేట్ ఫస్ట్… డెవలప్మెంట్ ఫస్ట్ అనే విషయాన్ని ప్రజాప్రతినిధులు అంతా గుర్తించాలి.” అని సీఎం వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Development AP economic link AP Economy AP growth Chandrababu Naidu CM directives Economic strengthening

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.