ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) భవిష్యత్తు దిశపై సీఎం చంద్రబాబు నాయుడు(CM CBN) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టే ప్రతి కొత్త బస్సు తప్పనిసరిగా ఎలక్ట్రిక్ ఏసీ (EV AC) బస్సే కావాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలకు నడిచే ‘పల్లెవెలుగు’ బస్సులకూ ఇదే విధానం వర్తించాలని స్పష్టం చేశారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, కాలుష్య రహిత ప్రయాణం అందించడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. పాత తరహా డీజిల్ బస్సుల వల్ల ఇంధన వ్యయం పెరగడమే కాకుండా పర్యావరణానికి నష్టం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read also: Swiggy Report: 93 మిలియన్ ఆర్డర్లతో స్విగ్గీలో బిర్యానీ హవా
1450 కొత్త ఈవీ బస్సులు, పాత డీజిల్ వాహనాలకు గుడ్‌బై
CM CBN: వచ్చే ఏడాది ఆర్టీసీ కొనుగోలు చేయనున్న 1450 బస్సులన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే కావాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న 8819 డీజిల్ బస్సుల స్థానంలో దశలవారీగా EV బస్సులను(Electric bus) ప్రవేశపెట్టాలని సూచించారు. అంతేకాదు, 8 ఏళ్ల కాలపరిమితిని దాటిన పాత బస్సులను తప్పనిసరిగా తొలగించి కొత్త ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేయాలని తెలిపారు. దీని ద్వారా నిర్వహణ ఖర్చులు తగ్గడంతో పాటు ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
తిరుమల–తిరుపతి రూట్‌కు 300 ఈ-బస్సులు, ప్రైవేట్ మెయింటెనెన్స్
తిరుమల–తిరుపతి మధ్య భక్తుల రద్దీ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 300 ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వడానికి అంగీకరించిందని సీఎం వెల్లడించారు. ఈ రూట్‌లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రశాంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించడమే లక్ష్యమని చెప్పారు. అలాగే, ఆర్టీసీ బస్సుల మెయింటెనెన్స్‌ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులకు సూచించారు. దీని వల్ల ఆర్టీసీపై ఆర్థిక భారం తగ్గి, సేవల నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం మీద రాష్ట్రంలో పచ్చదనం, ఆధునిక రవాణా వ్యవస్థ దిశగా ఇది కీలక ముందడుగుగా పేర్కొనవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also:
ఇకపై ఏపీలో కొనుగోలు చేసే బస్సులు ఏవీ?
అన్ని కొత్త బస్సులు ఎలక్ట్రిక్ ఏసీ (EV AC) బస్సులే.
పల్లెవెలుగు బస్సులకూ EV విధానం వర్తిస్తుందా?
అవును, గ్రామీణ బస్సులకూ ఎలక్ట్రిక్ ఏసీనే అమలు చేస్తారు.