CJI SuryaKant: తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయణమైన భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి సాదర వీడ్కోలు
Read Also:CJI SuryaKant: శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్
- భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఎంతో ప్రసిద్ధి గాంచిన లేపాక్షి రోజ్ వుడ్ తో తయారు చేసిన శ్రీనివాస స్వామి వారి కళ్యాణ చిత్రపటంను జ్ఞాపిక గా అందచేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్
- తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని నేటి ఆదివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగుపయనమైన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కి సాదర వీడ్కోలు లభించింది.
చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లా ప్రిన్సిపల్ జడ్జి అరుణ సారిక, తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి గురునాథ్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి, కోటేశ్వరరావు ప్రోటోకాల్ మెజిస్ట్రేట్, తదితరులు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి సాదర వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఎస్ ఎంతో ప్రసిద్ధి గాంచిన లేపాక్షి రోజ్ వుడ్ తో తయారు చేసిన శ్రీనివాస స్వామి వారి కళ్యాణ చిత్రపటం ను జ్ఞాపిక గా అందించారు..
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: