📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Civils: ఇంటర్ లో ఫెయిల్ అయ్యాడు.. అయితేనేం సివిల్స్ లో 988వ ర్యాంకు కొట్టాడు

Author Icon By Sharanya
Updated: April 25, 2025 • 4:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒకప్పుడు ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అయిన తెలుగు యువకుడు, ఇప్పుడు దేశ అత్యున్నత సర్వీసులలో ఒకటైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌లో 988వ ర్యాంకును సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇతని పేరు పామూరి సురేష్, ఒకప్పుడు చదవడానికి పనికిరాడు అని అన్న వారిని ఈ క్రమంలో అతను జవాబు ఇచ్చాడు.

అతని ప్రస్థానం:

సురేష్, తిరుపతి జిల్లా, నారాయణవనం మండలంలో గోవిందప్పనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన వాడు. విద్యాభ్యాసం విషయంలో అతడి ప్రయాణం ఎల్లప్పుడూ సాఫీగా సాగలేదు. పదో తరగతి వరకు సాధారణ విద్యార్థిగానే ఉన్న సురేష్, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో విఫలమై ఇంటి వారిని నిరాశకు గురిచేశాడు. ఇక చదువుకు పనికిరాడు అన్న మాటలు అతడిని బాధించాయి. అయితే, ఈ వైఫల్యం అతడిని కుంగించలేదు.

అతడి పట్టుదల:

ప్రముఖ స్ఫూర్తిదాయక వ్యక్తుల కథలను చదవటం, ఆలోచించడం, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం కోల్పోకపోవడం – ఇవన్నీ సురేష్ కు స్వయంగా స్ఫూర్తినిచ్చాయి. ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అయిన తర్వాత, సురేష్ డిప్లొమా కోర్సులో చేరి విజయం సాధించాడు. ఈ తర్వాత, ఈసెట్ పరీక్ష రాస్తూ, రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకును సాధించడం కూడా అతడికి మరింత ధైర్యం నిచ్చింది. ఇంజినీరింగ్‌లో బిఇ పూర్తి చేసి, 2011లో జెన్‌కోలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)గా ఉద్యోగం సంపాదించాడు. కానీ, అతడి మనస్సులో ఎప్పటికీ ఉన్నది సివిల్ సర్వీసెస్‌లో ఉన్నత స్థానాన్ని సాధించాలనే ఆశ. కేవలం ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడటం సరిపోదని, ఏదైనా గొప్పది సాధించాలనే సంకల్పంతో సురేష్ 2017లో మొదటి సారి సివిల్స్ పరీక్ష రాసాడు.

పట్టుదలతో విజయం:

మొదటి సారి ప్రిలిమినరీ పరీక్షలోనే విఫలమై, రెండో సారి ఇంటర్వ్యూ దశకు చేరుకున్నప్పటికీ ఫలితంలో స్థానం దక్కకపోవడం అతడికి మరింత కష్టం తెచ్చింది. కానీ, సురేష్ ఆ సమస్యలను అధిగమించి తన లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. 2020లో, తన ఉద్యోగాన్ని వదిలి, పూర్తిగా సివిల్స్ కు దృష్టి సారించాడు. ఈ నిర్ణయం సురేష్ జీవితంలో మునుపటి అన్ని వైఫల్యాలను అధిగమించి అతనికి సివిల్స్‌లో చేరే అవకాశాన్ని తీసుకువచ్చింది. ఆయన సిబిల్స్‌కు చివరి ప్రయత్నంలో, 7వసారి ప్రయత్నం చేయడం, ఈసారి అతడికి 988వ ర్యాంకు రావడం అనేది అతడి కృషి, ధైర్యం, పట్టుదలతో సాధించిన గొప్ప విజయంగా నిలిచింది. ఒకప్పుడు విద్యాపరంగా వెనుకబడిన విద్యార్థి, నేడు దేశ అత్యున్నత సర్వీసుల్లో ఒకటిగా పరిగణించే సివిల్స్‌కు ఎంపిక కావడం, అతడి కృషికి, పట్టుదలకు నిదర్శనం. సురేష్ విజయం ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.

Read also: P.S.R Anjaneyulu: ఆంజనేయులకు సీఐడీ కోర్టు బిగ్ షాక్

#CivilServices #CivilServicesJourney #Inspiration #NeverGiveUp #Rank988 #SuccessStory Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.