📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: CITU – ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలి : సిఐటియు రాష్ట్ర కమిటీ

Author Icon By Rajitha
Updated: September 15, 2025 • 2:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : పని యొక్క గంటల పెంపు బిల్లును ఉపసంహరించుకోవాలని సిఐటియు (CITU) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, సిహెచ్ నర్సింగరావు (CH Narsingha Rao) ప్రకటన విడుదల చేశారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో పని గంటలు పెంచుతూ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కార్మిక చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెడతామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి ప్రకటించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించడమంటే బిల్లును ప్రవేశపెట్టి తమ మందబలంతో ఆమోదింపజేసుకుంటామని చెప్పటం మినహా మరొకటి కాబోదని పేర్కొన్నారు. అంతకు ముందు మంత్రివర్గం ఆమోదం పొందిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా రద్దు చేయాలని కోరారు.

CITU

కార్మికులను మోసగించటానికేనని

కార్మికులు ఎక్కువ సెలవులు పొందే విధంగా ఈ సవరణలు చేస్తున్నామని చెప్పటం కార్మికులను మోసగించటానికేనని తెలిపారు. కర్ణాటక బిజెపి ప్రభుత్వం మొదటగా 2023లో ఫ్యాక్టరీల చట్టానికి సవరణలు చేసి పని గంటలు రోజుకు 12 గంటలు చేసిందని పేర్కొన్నారు. వారానికి 48 గంటల పని కొనసాగుతుందని, వారంలోపే 48 గంటలు పూర్తయితే మిగతా రోజులు వేతనంతో కూడిన సెలవు బడతాయని చెప్పిందని తెలిపారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం దాన్ని రద్దు చేయకుండా కొనసాగిస్తోందని పేర్కొన్నారు. గుజరాత్ బిజెపి (BJP) ప్రభుత్వం 2025 జులైలో 12 గంటల పని దినం బిల్లు పాస్ చేసిందని తెలిపారు. అలాగే కార్మిక సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించకుండా బిల్లు పెట్టేందుకు సిద్ధమవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు.

పని గంటల పెంపు బిల్లుపై సిఐటియు రాష్ట్ర కమిటీ ఏ డిమాండ్ చేసింది?
A: సిఐటియు రాష్ట్ర కమిటీ పని గంటల పెంపు బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.

ఈ ప్రకటన ఎవరు విడుదల చేశారు?
A: సిఐటియు అధ్యక్షుడు ఎవి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు ప్రకటన విడుదల చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/tivolt-company-donates-electric-vehicle-to-tirumala-srivaru/andhra-pradesh/547628/

Andhra Pradesh politics Breaking News CITU Factory workers Industrial workers Labour laws amendment latest news Telugu News Work hours bill

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.