📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

the movie: ‘సినిమా’ సంస్కరణలూ అవసరమే!

Author Icon By Sudha
Updated: January 26, 2026 • 5:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పూ ర్వం ప్రజలు తమ వినోద కాలక్షేపాలకు పౌరాణిక పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, హరికథలు, బుర్రకథలు, ఇంకొన్ని జానపద కళారూపాలను ఆశ్రయించే వారు. అవి ఆనాటి ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి, అలరించాయి. కొన్ని దశాబ్దాల అనంతరం కళారూపాల సాంస్కృతిక సేవను క్రమేపీ చెరిపేసేలా చేసింది చలనచిత్ర రంగం. ఈ రంగం మూకీ నుండి టాకీ, బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్, సాదా సౌండ్ నుంచి డాల్బీ సౌండ్ వరకు పరిణామక్రమం చెందింది. అక్కడితో ఆగక ఎన్నో అధునాతన సౌకర్యాలు అందిపుచ్చుకుని మెరుగుపడింది. ఇంకా చలనచిత్రాలు అనేకరకాల సినీ సెట్టింగ్లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి, తమవైపుకు తిప్పుకున్నాయి. ఐతే ఏదీ కలకాలం తన ప్రతాపాన్ని, ప్రభావాన్ని చూపలేదు. ఎక్కడో ఒక దగ్గర దానికి అడ్డుతగలక తప్పదు. పాతపోయి కొత్త, కొత్తపోయి పాత రావడం సహజం. దీన్నే చక్రగమనం అంటారు. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. లోకంలో అలువును బలువు కొడితే బలువును బ్రహ్మదేవుడు కొడుతాడు’ అనే సామెతొకటుంది. ఇది అక్షరాలా నిజం. సినిమా అత్యంత ప్రజాదరణ, ప్రభావశీలమైన వినోద మాధ్యమం. ఇది ఒకప్పటి మాట. నేడు ఆ పరిస్థితి లేదు.

Read Also : http://Murali Mohan: లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది: నటుడు

the movie

బుల్లితెర ప్రభావం

కొన్ని దశాబ్దాల క్రితమే సినిమా ప్రభావాన్ని మరిపించే బుల్లితెర ప్రతి ఇంట వచ్చి చేరింది. ఇది తన ప్రతాపాన్ని జనంపై విపరీతంగా చూపింది. దాంతో ఎంతోమంది బుల్లితెరకు బానిసల య్యారు. నేటికీ టీవీలో ప్రసారమయ్యే వివిధ లైవ్స్, సీరియల్స్ చూస్తూ జనం కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు సినిమాలకు బదులు సీరియల్స్ చూడడం అల వాటు చేసుకున్నారు. ఈ వ్యవహార శైలే నేడు సినీపరిశ్రమ కు గుదిబండగా మారింది. ఇదేకాక ప్రపంచీకరణలో భాగం గా అనేక ప్రసార, ప్రచార మాధ్యమాలు విపరీతంగా అందుబాటులోకి వచ్చాయి. సినిమాకి, టి.వీకి ప్రత్యామ్నాయంగా వివిధ సామాజిక మాధ్యమాలు వచ్చిపడ్డాయి. పలు వెబ్సైట్లు, వ్యక్తిగత బ్లాగులు అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రభావం కూడా ప్రజలపై ఎక్కువగానే ఉంది. వీట న్నిటి దాడివల్ల నేడు సినిమారంగం అనేక కష్టనష్టాలతో కునారిల్లుతోంది.

కళారూపాలకు ప్రత్యామ్నాయం

చలనచిత్ర రంగం ఒక దశలో విరాట్రూపం దాల్చింది. సినిమా ఎంత ఉచ్ఛదశలో ఉ న్నప్పటికీ, జానపద కళారూపాలు మరుగునపడలేదు. ఆనాటి కళారూపాలకు ప్రత్యామ్నాయంగా నిలచిందే తప్ప, కళారూపాలమనుగడకు ప్రశ్నార్థకం కాలేదు. అలాంటి సినిమా (the movie) రంగం గత దశాబ్ద న్నర కాలం నుండి తన ప్రభావాన్ని కోల్పోతున్నది. అంత ర్జాలం, కంప్యూటర్, ఐ పాడ్, స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత సినిమా (the movie) వైపు చూసే జనం కరువయ్యా రు. సినిమాను మించిన లైవ్స్, వెబ్సైరీస్, షార్ట్ ఫిలిమ్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటికి అదనంగా ప్రపంచ వ్యాప్తంగా నిర్మితమోతున్న అనేక సాంస్కృతిక కార్యక్రమాల వీక్షణకు కొదువే లేకుండా పోయింది. కాబట్టి థియేటర్కి వెళ్లి సినిమాలు చూసే ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గారన్నది సత్యం. టీవీ, వెబ్ సిరీస్, సీరియల్స్కు సంబంధించిన ఎపిసోడ్లను ఒకేసారిగా వీక్షించడాన్ని, వాటిమీదే ధ్యాసంతా ఉంచటాన్ని బింజ్ వాచింగ్ అంటారు. ఈ వాచింగ్ కోవిడ్ కాలంలో జనాలకి అంటుకుంది. అక్కడతో ఆగక కోవిడ్ అనంతర కాలంలో దీన్ని వ్యసనంగా మార్చు కున్నారు. సాధారణంగా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా వైఫల్యాలు పొందినవారు ఈ బింజ్వా చింగ్కి అలవాటుపడతారు. ఇంకా కాలేజ్ అమ్మా యిలు, అబ్బాయిలు కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయనే భ్రమ తో కొరియన్ సిరీస్ చూస్తున్నారు. ఇవన్నీ సినిమా రంగాన్ని కూకటివేళ్లతో కుదిపేసేవే. ఐతే ఆనందించాల్సిన విషయం లేకపోలేదు.

వ్యక్తుల గుత్తాధిపత్యమే

మంచి సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుం ది. నేడు థియేటర్లకు వెళ్లి అంతోఇంతో సినిమాలుచూస్తున్న వాళ్లు యువతీయువకులే. వీరే ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ ట్రెండ్ అయిన సినిమాలు చూస్తున్నారు. వీరివల్లనే ఇంకా సినిమా రంగం బ్రతికున్నది. లేకపోతే పూర్తిగా థియేటర్లు మూసివేయాల్సి వచ్చేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే థియేటర్లు ఎక్కువగా ఉండేవి. నేడు ఆ థియేటర్లలో చాలా మూసివేయబడ్డాయి. ఉన్నవి జనం లేక బోసిపోతున్నాయి. తెలుగులోనే ఏడాదికి ఎక్కువ సినిమాలు విడుదలయ్యేవి. ఒక హీరో సగటున ఏడాదికి ఐదారు సినిమాలు చేసేవాడు. ఈ పరిస్థితి నేడు లేదు. అదే హీరో నేడు రెండేళ్లకో, మూడేళ్ల కో ఒక సినిమాతో వస్తున్నాడు. ఇది సినీ నిర్మాణ రంగ వైఫల్యమో! లేక నాణ్యతకై పడినపాట్లో! అర్థంకావడంలేదు. కొత్తనటుల సినిమాలు, ఇతర భాషల డబ్బింగ్ చిత్రాలు తెలుగులోకి ఎక్కువగా వస్తున్నాయి. పాన్ ఇండియా చిత్రాల నిర్మాణం పెరిగింది. థియేటర్ల సంఖ్య తగ్గిన నేపథ్యంలో ఇలాంటి చిత్రాల ప్రదర్శనకు థియేటర్లు కరువయ్యాయి. ఈ సమస్యకు ముఖ్యకారణం కొంతమంది వ్యక్తుల గుత్తాధిపత్య మే. వారిచేతుల్లోనే థియేటర్లు నడుపబడుతున్నాయి. దీని వల్ల చిన్న బడ్జెట్ చిత్రాల నిర్మాతలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల అనివార్యంగా ఆయా సిని మాలను ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీ యజమాన్యా లు కూడా ఆడిందే ఆట పాడిందే పాటలాగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల చిన్న నిర్మాతలు ఆర్థికంగా నష్ట పోతున్నారు. ఈ రంగంలో మరో సమస్య ఏమిటంటే, ప్రక టించిన తేదీకి సినిమాలు విడుదల కాకపోవడం. అంటే దీనర్థం నిర్మాణ లోపం కొట్టొచ్చినట్లు కనబడడడమే. పెద్ద బడ్జెట్ చిత్రాలకు టిక్కెట్ ధరలు పెంచడం ఎప్పటినుంచో ఉంది. ఐతే నేడు టికెట్ ధరల పెంపుపై కోర్టు ఆంక్షలు ఉన్నాయి. ప్రత్యేకించి తెలంగాణాలో సినిమా విడుదలకు తొంభై రోజులు ముందే టిక్కెట్ ధర పెంచే జీవోను జారీ చేయాలని రాష్ట్ర హోంశాఖకు గౌరవ న్యాయస్థానం ఆదేశిం చింది. అందువల్ల నిర్మాతలు పక్కా ప్రణాళికతో సినిమావిడు దల తేదీని ప్రకటించాలి. లేనిచో నామమాత్రపు ధరలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాచేస్తే పెద్ద బడ్జెట్ సినిమాల నిర్మాతలకు నష్టదాయకం.

the movie

టికెట్ ధరలు

ఒకప్పటిలా సినిమా లాంగ్ రన్తో ముందుకుపోవాలంటే ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచ కూడదనే వాదన కూడా ఉంది. తద్వారా ప్రేక్షకుడు చౌకగా సినిమా వినోదాన్ని పొందగలడనేది వారిఅభిప్రాయం. హీరో లు పారితోషికాలు వందల కోట్లలో పెరిగాయి. దీనివల్ల సిని మారంగం కుదేలవుతున్నదన్న మాట వాస్తవమే. బడ్జెట్లో సగభాగం హీరోకే దక్కితే, మరి మిగతా నటులకు? ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఖర్చుపెట్టిన నిర్మాతలకు వచ్చే లాభాలెం? దీనికి తోడు అదనంగా అగ్రనటుల మధ్య సినీ కుల రాజకీయ వైరం. అదికాస్తా బాగుందన్న సినిమానుచూడ కుండా చేసే కుయుక్తులకు దారితీస్తున్నది. ఇవాళ చిత్ర నిర్మాణం, చిత్ర పంపిణీ, సినిమాహాళ్ళ నిర్వహణ, టికెట్ల అమ్మకం యావత్తూ బడా పారిశ్రామికవేత్తల గుప్పిళ్లలో ఉన్నాయి. అందువల్లనే చౌకగా దొరికే సినిమా వినోదం ఎంతో ప్రియమైపోయినది. ఒకప్పుడు సినిమాకి ఒక వ్యక్తి వెళ్తే. సినిమా టికెట్తో పాటు తినుబండారాలకయ్యే ఖర్చుకి కలిపి ఒక రూపాయి మించేదికాదు. కానీ నేడు ఒకకుటుంబం మల్టీప్లెక్స్ ల్లో, ఎ.సి థియేటర్లలో సినిమాలు చూసేందుకు వెళితే, వేల రూపాయల్లో ఖర్చవుతున్నది. దీనివల్లనే థియే టర్లలో జనం సినిమాలు చూడడం లేదు. ఎక్కడ తమ జేబులు ఖాళీ అవుతాయో! అన్న భయంతో కన్నెత్తిచూడటం లేదు. ఎప్పుడైతే సినిమా వినోదం ఖరీదయ్యిందో! అప్పటి నుంచే వివిధ ఫేక్ వెబ్సైట్లలో ఉచితంగా సినిమాలను వీక్షించడం పెరిగింది. వీటన్నింటి నుండి సినిమా రంగం బయటపడాలి. దీనికై పలు సంస్కరణలు తేవాలి.
– పిల్లా తిరుపతిరావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Cinema cultural-change film-industry latest news Media movie-reforms Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.