📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: CII Summit: డబుల్ ఇంజన్ సర్కారుపై పెట్టుబడిదారుల్లో పెరిగిన విశ్వాసం

Author Icon By Rajitha
Updated: November 17, 2025 • 11:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సిఐఐ సదస్సు విజయంతంపై మంత్రి సత్యకుమార్ సచివాలయం : విశాఖలో సిఐఐ 30వ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు విజయవంతం కావడం పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని మోది (Modi) దిశా, నిర్దేశం, సహకారం, అండదండలు, సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షత, కార్యాచరణవల్ల ఎపిలో పెట్టుబడులు వెలువెత్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ పత్రికా ప్రకటన జారీచేశారు “గత వైకాపా పాలనలో గతి తప్పిన రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తున్న కృషి వల్ల ఎపికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి లభిస్తోంది.

Read also: Pawan kalyan: వైసీపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: జనసేన

CII Summit: డబుల్ ఇంజన్ సర్కారుపై పెట్టుబడిదారుల్లో పెరిగిన విశ్వాసం

రూ.2.80 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి

విశాఖలో మూడురోజులపాటు పెట్టుబడులపై జరిగిన వరుస సమావేశాల ద్వారా అంచనాలకు మించి, 12 రంగాల్లో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం పిఎం, సిఎంల దార్శనికత, ఐక్యత, సమర్ధతకు నిదర్శనం. సిఎం చంద్రబాబు స్పీడ్ ఆఫ్ ఏడాది డూయింగ్ బిజినెస్ విధానం పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకరంగా ఉంది. ఒప్పందాలు జరిగిన వెంటనే పారిశ్రామిక సంస్థలకు అనుకూల ఉత్తర్వులు ఇవ్వడం ఓ చరిత్ర. ఇలాంటి ఉత్తమ విధానాలు పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. వ్యవధిలోనే పిఎం మోది రాష్ట్రంలో 3సార్లు పర్యటించి, రూ.2.80 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు, పరిశ్రమలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు.

కృత్రిమ మేధ హబ్

వరుస పర్యటనల ద్వారా రాష్ట్రంపై తనకు ఉన్న ప్రత్యేక శ్రద్ధ గురించి పిఎం మోది చాటి చెబుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టి కృషితో వ్యవహరిస్తున్నందున ఫలితాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. గూగుల్ సంస్థ అమెరికా దేశంలోనే వెలుపల తొలిసారిగా విశాఖ సాగర తీరంలో కృత్రిమ మేధ హబ్ నిర్మించబోతుంది. అదే సాగర తీరంలో పారిశ్రామిక సంస్థలు ప్రకటించిన పెట్టుబడులతో విశాఖ మహానగర ఖ్యాతి మరింత విస్తరించ బోతుంది. 2040 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనకు జరిగే కృషిలో ఆంధ్రప్రదేశ్ కీలకంగా వ్యవహరించబోతుంది. మరోపక్క సంక్షేమ పథకాల అమల్లోనూ కూటమి ప్రభుత్వం దూసుకుపోతోంది. సూపర్ సిక్స్ హామీలు ఖిసూపర్ హిటు అయ్యాయి” అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AndhraPradesh Chandrababu CII Investments latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.