📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

News Telugu: CID: చంద్రబాబుకి భారీ ఊరట CID కేసు క్లోజ్..

Author Icon By Rajitha
Updated: November 27, 2025 • 2:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెట్టిన ఫైబర్‌నెట్ కేసు అధికారికంగా మూసివేయబడింది. జగన్ (jagan) ప్రభుత్వం కాలంలో ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి అక్రమాలు జరిగినట్లు నిర్దారించలేకపోవడంతో, చంద్రబాబుతో పాటు మరో 15 మందిపై ఉన్న ఆరోపణలు రద్దయ్యాయి. ఆ సమయంలో ఫిర్యాదు చేసిన ఫైబర్‌నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి కూడా ఆధారాలు లేవని కోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపారు. దీంతో కేసు మూసివేయడాన్ని ఏసీబీ కోర్టు అంగీకరించింది.

Read also: AP Rain: ఏపీ కి పొంచివున్న భారీ తుఫాన్‌

huge relief for Chandrababu Naidu.. CID case registered

కేసు మూసివేతతో చంద్రబాబుకు పెద్ద ఊరట

సీఐడీ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వ భారత్‌నెట్ పథకం కింద వచ్చిన నిధుల్లో రూ.321 కోట్లు టెర్రాసాఫ్ట్‌కు బదిలీ చేశారన్న ఆరోపణలు సాక్ష్యాలతో నిరూపించబడలేదు. ఫైబర్‌నెట్ ప్రాజెక్టుకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని కూడా క్లారిటీ ఇచ్చింది. దీనిపై ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మతో పాటు అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డి కూడా కోర్టులో హాజరై నివేదికతో పూర్తిగా ఏకీభవించారు.

దీంతో ఈ కేసు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పెట్టినదని, వాస్తవ ఆధారాలు లేనివని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేసు మూసివేతతో చంద్రబాబుకు పెద్ద ఊరట లభించగా, దర్యాప్తు సంస్థ కూడ తమ ఫైనల్ రిపోర్ట్ ద్వారా ప్రాజెక్టు నిర్వహణలో ఎలాంటి అవకతవకలు లేవని స్పష్టం చేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

chandrababu-naidu CID-Case Fibrenet-Project latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.