సంక్రాంతి పండుగను ప్రజలు ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గుత్తి పట్టణంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో గుత్తి సీఐ రామారావు మాట్లాడుతూ, జూదం లేదా కోడి పందేలు నిర్వహించినా, వాటిలో పాల్గొన్నా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పట్టణ పరిధిలో ఎలాంటి జూద కార్యకలాపాలకు అనుమతి లేదని, నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పండుగ పూట అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి చట్టానికి సహకరించాలని ప్రజలను కోరారు.
Read also: AP: ఆ ఉద్యోగులు సంక్రాంతి రోజుల్లో కూడా పని చేయాల్సిందే..!
warning in Gutti during the Sankranthi festival
అదేవిధంగా సంక్రాంతి (sankranthi) సందర్భంగా గాలిపటాలు ఎగరేసేటప్పుడు విద్యుత్ తీగల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయానికి దారితీయవచ్చని పేర్కొన్నారు. పండుగ వాతావరణాన్ని చెడగొట్టే చర్యలకు పాల్పడకుండా, కుటుంబ సభ్యులతో సురక్షితంగా పండుగను జరుపుకోవాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది. శాంతియుతంగా సంక్రాంతిని నిర్వహిస్తేనే సంప్రదాయ పండుగకు నిజమైన అర్థం ఉంటుందని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: